సుకుమార్ పై ప్రేమా కాదు పాడూ కాదట

సుకుమార్ మీద ప్రేమతో నిర్మాత బివివిఎస్ఎన్ ప్రసాద్ బిఎమ్ డబ్ల్యు కారు కొనిచ్చారు. సుకుమార్ తో రెండు సినిమాలు చేసిన ప్రసాద్ కు ఆయన మీద ఎంత ప్రేమో? ఇదీ వార్త.

ప్రేమా, కాదు దోమా కాదు, సుకుమార్ కు కాస్త బకాయివున్న డబ్బులు డౌన్ పేమెంట్ గా కట్టేసారు. తరువాత ఇన్ స్టాల్ మెంట్లు సుకుమార్ కట్టుకుంటారు. పెద్దకారు కొనేసుకున్నాడు, పెద్దోడైపోయాడు అంటూ గుసగుసలు ప్రారంభిస్తారేమో అన్న చిన్న ఇబ్బంది. అందుకే ఈ తరహా వార్త....ఇదీ నిజం.

ఈ శుక్రవారం సుకుమార్‌ చేతికి బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌త్రీ సీరిస్ కారు రావడం వరకు నిజం. అది కూడా బివివిఎస్ఎన్ ప్రసాద్ పంపించడం వరకు నిజం. కానీ బహుమతి మాత్రం కాదు, బాకీ చెల్లింపు మాత్రమే. అయినా ప్రసాద్ గారు ఇప్పుడు భారీ బహుమతులు ఇచ్చే స్టేజ్ లో లేరు. అల్లరి నరేష్ తో సినిమా కంప్లీట్ చేసే పనిలో వున్నారు.

Show comments