డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ మిల్కీ బ్యూటీ

''సినిమాలో నటిస్తున్నాను.. అందులో పాటలకి డాన్స్‌ చేస్తున్నాను.. ఆ డాన్స్‌ అంటే నాకిష్టం. స్పెషల్‌ సాంగ్స్‌ అనండీ, ఐటమ్‌ సాంగ్స్‌ అనండీ.. పేరేదైనా అదీ డాన్సే కదా.. నటించినందుకు డబ్బులు తీసుకుంటున్నాను.. డాన్స్‌ చేసినందుకూ డబ్బులు తీసుకుంటున్నాను.. దానికీ దీనికీ తేడా ఏంటి.? రెండూ చేస్తున్నది సినిమాల్లోనే కదా.. నేనేం చేస్తున్నానో నాకు పూర్తి క్లారిటీ వుంది..'' అంటూ ఐటమ్‌ సాంగ్స్‌పై తమన్నా క్లారిటీ ఇచ్చేసింది. 

తమన్నా ఇప్పటికే పలు సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో అయితే ఏకంగా రెండు సినిమాల్లో వరుసగా ఐటమ్‌ సాంగ్స్‌ చేసేసింది తమన్నా. తాజాగా కన్నడలో రూపొందిన 'జాగ్వార్‌' సినిమా కోసం ఐటమ్‌ సాంగ్‌ చేసింది. అది తెలుగులోనూ విడుదలవుతోందనుకోండి.. అది వేరే విషయం. 

హీరోయిన్‌గా ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, ఇంకోపక్క ఐటమ్‌ సాంగ్స్‌ చేయడమెందుకు.? ఎక్కువ రెమ్యునరేషన్‌ వస్తోందనా.? అంటే, అది కూడా ఓ కారణమే కావొచ్చు.. దానికన్నా ముందు, అది కూడా సినిమాలో నటించడంలాంటిదే కదా.. అంటూ సమాధానమిచ్చింది తమన్నా. ఎంతైనా మిల్కీ బ్యూటీ తమన్నా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌. అందుకే, ఏమాత్రం తొణక్కుండా టకీ టకీ సమాధానం చెప్పేసింది. దటీజ్‌ మిల్కీ బ్యూటీ.

Show comments