అనుష్క అమ్మగా టబు

అంతే..నిన్నటి హీరోయిన్ నేటి అమ్మ అన్నదే టాలీవుడ్ రూలు. యువి క్రియేషన్స్ బాగమతిలో టబు నటిస్తున్న సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది. ఆ క్యారెక్టర్ అమ్మ క్యారెక్టర్ అన్నది లేటెస్ట్ సంగతి. ఆ సినిమాలో భాగమతి వేషం వేస్తున్న అనుష్కకు తల్లిగా టబు కనిపిస్తుందని తెలుస్తోంది. 

అశోక్ కుమార్ దర్శకత్వంలో తయారవుతున్న భాగమతి సినిమాకు, కమర్షియల్ గా ఫలితం వుండాలంటే వీలయినన్ని అట్రాక్షన్లు జోడించాలన్నది యువి క్రియేషన్స్ ఆలోచన అంట. అందుకే అనుష్కను మాత్రమే నమ్ముకోకుండా, వీలయినంత మంది స్టార్ లను జోడించాలని చూస్తున్నారట. త్వరలో మరో ఒకటి రెండు పేర్లు కూడా బయటకు వస్తాయని అంటున్నారు.

Readmore!
Show comments

Related Stories :