నయన్ రాకుంటేనేం వెంకీ రెడీ

సినిమా చేస్తా, పారితోషికం తీసుకుంటా..ఫంక్షన్లు, ప్రమోషన్లు తన వల్ల కాదు అనే నటి నయన్ తార. ఏం చేస్తారు, అవసరం తప్పదు కాబట్టి బాబు బంగారంలోకి తీసుకున్నారు. సినిమా పూర్తయింది. సెన్సారైపోయింది.విడుదలకు రెడీ అవుతోంది. మరి ప్రమోషన్ సంగతేమిటి? అందుకే వెంకీ రంగంలోకి దిగాడట. 

యూజవల్ గా వెంకీ ప్రమోషన్ల విషయంలో నాగార్జున అంత స్పీడ్ లేదా కాంటెంపరరీ కాదు. కానీ ఈసారి నయన్ వ్యవహారం ఇలా వుందనేసరికి, వెంకీ తానున్నానని భరోసా ఇచ్చేసాడట. విజువల్ మీడియాలకు ఇచ్చేందుకు ఇంటర్వూలు రెడీ చేసేందుకు రంగంలోకి దిగపోయాడట. 

అలాగే అన్నిమీడియాలతో వీలయినంత ఎక్కువగా ఇంట్రాక్ట్ కావడానికి తాను రెడీ అని నిర్మాతలకు సిగ్నల్ ఇచ్చేసాట. హీరోయిన్ రాకపోయినా పబ్లిసిటీ పరంగా సినిమా ఏమాత్రం వెనక్కు తగ్గడానికి వీల్లేదని క్లియర్ గా చెప్పేసాడని వినికిడి. ఇప్పటికే పార్క్ హయాత్ లో కొన్ని ప్రీ రికార్డెడ్ ఇంటర్వూలు, డిస్కషన్ల షూట్ ఫినిష్ చేసేసాడంట. దటీజ్ వెంకీ అన్నమాట.

Show comments