హీరోయిన్ భర్తే చిరు విలన్

చూడాలని వుంది సినిమాలో మెగాస్టార్ తో చిందేసింది..అంజలా ఝవేరి. ఆ టైమ్ లో తెలుగులో ఓ ఊపు ఊపేసింది. ఆ తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో అంజలా ఝవేరి పేరు వినిపిస్తోంది. అయితే అలా అని ఆమె నటించడం లేదు. ఇక్కడకు రానూలేదు. 

కానీ ఆమె భర్త తరుణ్ అరోరా వచ్చాడు. తెలుగులో నటించడానికి. తరుణ్ అరురో కూడా నటుడే. కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ, రెండు తమిళ సినిమాల్లోనూ నటించాడు. అతన్ని ఇప్పుడు మెగాస్టార్ 150వ సినిమాలో విలన్ గా తీసుకున్నారు. 

వాస్తవానికి ఈ పాత్రకు జగపతిబాబు అనుకున్నారు. కానీ ఎందుకో సెట్ కాలేదు. ఆ చాన్స్ అంజలా ఝవేరీ హస్బెండ్ కు దక్కింది. జగపతి  బాబుకు మరో క్యారెక్టర్ ఇచ్చారు. సో, ఆ విధంగా మళ్లీ మెగాస్టార్ కు దగ్గరవుతోంది అంజలా ఝవేరి.

Show comments