సన్నీలియోన్‌ సిగ్గుపడ్తోందా.?

ఇదివరకటి పోర్న్‌ లైఫ్‌ పట్ల సన్నీలియోన్‌ సిగ్గు పడ్తోందా.? ఔననే అంటున్నారు బాలీవుడ్‌ సినీ జనం. దిలీప్‌ మెహతా, సన్నీలియోన్‌ మీద ఓ డాక్యుమెంటరీని తీసి, దాన్ని టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించాడు. అయితే, ఈ కార్యక్రమానికి సన్నీలియోన్‌ డుమ్మా కొట్టింది. 'నన్ను ఆశ్చర్యపరిచింది ఈ విషయం.. సన్నీలియోన్‌ ఎందుకు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టిందో ఆమెకే తెలియాలి..' అంటూ దిలీప్‌ మెహతా పబ్లిసిటీ స్టంట్‌ చేశాడన్నది ఇక్కడ నిర్వివాదాంశం. 

అయితే, ఈ విషయాన్ని లైట్‌ తీసుకోవాల్సిన సన్నీలియోన్‌, 'నా జీవితంలో ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసు. నాకంటూ ప్రైవసీ జీవితం అనేది వుంటుంది. దాన్ని బయటపెట్టాలనుకుంటే ఎలా.? అది డాక్యుమెంటరీ కాదు, సినిమాటిక్‌గా వాళ్ళకు నచ్చింది తీశారంతే..' అని ఘాటుగా స్పందించింది. 

దాంతో, సన్నీలియోన్‌.. తన గత చరిత్ర.. అదే పోర్న్‌స్టార్‌గా ఆమె గడిపిన జీవితం గురించే ఆందోళన చెందుతుందనే విషయం అర్థమయిపోయింది. 'నా గత జీవితం గురించి నేనేమీ ఆందోళన చెందబోను..' అంటూ చాలా సందర్భాల్లో పోర్న్‌ కెరీర్‌పై నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేది సన్నీలియోన్‌. కానీ, ఇప్పుడు ఆమె కాస్త మారింది. బహుశా ఇండియాలో ఎక్కువ కాలం నుండి వుండడం వల్లేనేమో ఆమెలో ఈ మార్పు.! 

డాక్యుమెంటరీ విషయంలో సన్నీలియోన్‌ తప్పించుకు తిరగొచ్చుగాక. కానీ, ఇంటర్నెట్‌లో సన్నీలియోన్‌ పోర్న్‌ వీడియోలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. వాటిని సన్నీలియోన్‌ ఎలా మర్చిపోగలదు.?

Show comments