హాట్‌ అండ్‌ స్పైసీ: జాక్‌.. ఎంత కష్టమో.?

జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ బాలీవుడ్‌లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది. పెద్ద హీరోల్ని ముందుగానే ఎట్రాక్ట్‌ చేసేసిన ఈ బ్యూటీ, ఆ పెద్ద హీరోల చలవతో చాలా పెద్ద హీరోయిన్‌ అయిపోయింది. ఈ శ్రీలంకన్‌ బ్యూటీ, వరుస అవకాశాలతో మిగతా బాలీవుడ్‌ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తోంది. 

ఈ ఏడాది జాక్వెలైన్‌ నుంచి ఇప్పటికే మూడు సినిమాలొచ్చేశాయి. ఓ వైపు సినిమాలు, ఇంకో వివిధ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కమిట్‌మెంట్స్‌.. వెరసి జాక్వెలైన్‌ చాలా బిజీగా వుందిప్పుడు. జాక్వెలైన్‌కి సల్మాన్‌ఖాన్‌ వెరీ వెరీ స్పెషల్‌. ఎందుకూ.? అని ప్రశ్నిస్తే, తాను బాలీవుడ్‌లో ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి కారణం సల్మాన్‌ఖానేనని చెబుతంది జాక్వెలైన్‌. 

అవును మరి, కత్రినాకైఫ్‌ని పక్కన పెట్టి, జాక్వెలైన్‌ని సల్మాన్‌ఖాన్‌ కొన్నాళ్ళు ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌ అవసరం జాక్వెలైన్‌కి లేదనుకోండి.. అది వేరే విషయం. గ్లామర్‌లో ఏ టూ జెడ్‌ అన్నిటికీ సిద్ధమేనని చెప్పే జాక్వెలైన్‌, బికినీలో కనిపించడం కన్నా, ఇండియన్‌ ట్రెడిషన్‌ అయిన చీరకట్టులో కన్పించడమే ఇష్టమట. బికినీతో పోల్చితే, చీరకట్టు కోసమే అద్భుతమైన ఫిజిక్‌ వుండాలట. అలాంటి ఫిజిక్‌ కోసం రోజువారీ శ్రమ (వర్కవుట్స్‌) తప్పవని చెబుతోంది జాక్వెలైన్‌. 

ఫొటో చూస్తున్నారు కదా.. ఇలాంటి వర్కవుట్స్‌తో జాక్వెలైన్‌, ఫిజిక్‌ని ఫిట్‌గా వుంచుకుంటోందన్నమాట. వర్కవుట్స్‌ అంటే బద్ధకం.. పైగా కష్టం.. అయినా హీరోయిన్‌గా కెరీర్‌ బాగుంటాలంటే ఆ కష్టాన్ని ఇష్టంగా భరించక తప్పదంటున్న జాక్వెలైన్‌, అందానికీ ఆరోగ్యానికీ వర్కవుట్స్‌ ఎంతో ఉపయోగపడ్తాయని చెప్పుకొచ్చింది.

Show comments