బాహుబలి-2పై చిరంజీవి రెస్పాన్స్

బాహుబలి-2 సినిమా విడుదలై 48 గంటలు దాటింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలేకుండా అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. తాజాగా చిరంజీవి ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తారు. బాహుబలి-ది కంక్లూజన్ మూవీని ఔట్ స్టాండింగ్ ఫిలింగా అభివర్ణించిన చిరంజీవి.. క్రెడిట్ మొత్తం రాజమౌళికే దక్కుతుందన్నారు.

రాజమౌళి తర్వాత సినిమా యూనిట్ అందర్నీ పేరుపేరునా ప్రస్తావించారు చిరంజీవి. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ కు కంగ్రాట్స్ చెప్పారు. మరీ ముఖ్యంగా రచయిత విజయేంద్రప్రసాద్, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తో పాటు గ్రాఫిక్స్ విభాగానికి ప్రత్యేకంగా అభినందలు తెలిపారు చిరంజీవి.

బాహుబలి-2 సినిమాను మెచ్చుకుంటూ ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ట్వీట్స్ చేశారు. మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవితో పాటు వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ రెస్పాండ్ అయ్యారు.

Show comments