హ్హే..మీడియాకు గుళ్లు కనిపించాయి

తెలుగుదేశం అనుకూల మీడియా భలే చిత్రంగా వుంటుంది. అది చూడాలనుకున్నవే చూస్తుంది..చూస్తే బాబుకు ఇబ్బందిగా వుంటుంది అనుకున్నవాటి వైపు చూడమన్నా చూడదు. విజయవాడలో గడచిన  వారం రోజులుగా దేవాలయాల వ్యవహారాలు రచ్చ రచ్చ అవుతున్నా, ఆ మీడియాకు కనిపించలేదు. ఆలయాలు అడ్డగోలుగా కూల్చేస్తున్నా సింగిల్ కాలమ్ వార్త కాలేదు.

కానీ విజయవాడ లోకల్ జనాలకు మీడియా అక్కర్లేదుగా. ఆలయాలు ఎలా కూలుస్తున్నారో అర్థం అయిపోతుందిగా. పైగా సాక్షి పత్రిక ఫొటోలు సాక్ష్యంగా వార్తలు అందిస్తోంది. బాబా విగ్రహాన్ని రోడ్డుపై ఎలా వదిలేసారో జనాల కళ్లకు కట్టింది. దీనికి తోడు భాజపా నాయకులు రంగంలోకి దిగారు. ఇదంతా కంపు కంపు అవుతోందని చంద్రబాబు నాయుడుకు అర్థం అయింది. అందుకనే ఇక గుళ్లు కూల్చబోమని (కూల్చాల్సినవి కూల్చేసారుగా), కూల్చినవి మరో చోట రీప్లేస్ చేస్తామని (అదెప్పుడొ?) మంత్రుల చేత, తమ పార్టీ నాయకుల చేత చెప్పించారు.

అదిగో..ఆ వైనం మాత్రం తెలుగుదేశం అనుకూల మీడియాకు 70ఎమ్ఎమ్ లో కనిపించింది.. గుళ్లు కూల్చరు.,. గుళ్లు పదిలం.. గుళ్లకు వచ్చిన భయం లేదు అనే దేశం పాజిటివ్ వార్తలు ఇప్పుడు ఫ్రంట్ పేజీలకు ఎక్కేసాయి.

అయితే ఇక్కడ ఆ మీడియా మిస్ అయిన లాజిక్ ఏమిటంటే.. ఇప్పుడు గుళ్లు పదిలం అని చెబుతున్నారంటే, నిన్న, మొన్న సాక్షి చెప్పిన గుళ్లు కూల్చివేత నిజమే అని ఇప్పుడు జనాలు నిర్థారణకు వస్తారని ఎందుకు అనుకోలేదో?

Show comments