ఈపీసీ నిర్మాత నక్కతోక తొక్కారు

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మొత్తానికి పెద్ద హిట్ అన్న దిశగా వెళ్తోంది. ఈ సినిమా శాటిలైట్ అమ్మకపోవడం అన్నది నిర్మాతకు వరంగా మారింది. మూడున్నర కోట్లకు మాటీవీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ నిర్మాత ఇవ్వాలా? ఇంకా రేటు వస్తుందా అని ముందు వెనుకలాడుతుంటే, జెమిని పోటీలోకి దిగి నాలుగున్నరకు పైగా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

దీంతో నిర్మాత ఫుల్ ఖుషీ అయిపోతున్నారట. సినిమా ఖర్చు ఎంత లెక్కపెట్టినా ఏడు నుంచి ఎనిమిది కోట్లు. అందులో సగానికి పైగా శాటిలైట్ తోనే కవర్ అయిపోతోంది. ఇప్పుడు అర్జెంట్ గా నిర్మాత కొత్త ఆఫీసు తీసారు. దాని ఓపెనింగ్ కు మాంచి పార్టీ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. తరువాతి సినిమా ఏమిటా అని ఆలోచనలు స్టార్ట్ చేసేసారు. 

ఇక హీరో నిఖిల్ కూడా హ్యాపీనే.తన రెమ్యూనిరేషన్ లో పార్ట్ గా ఆయన కర్ణాటక హక్కులు తీసుకుని, 28 లక్షలు మినిమమ గ్యారంటీ, ఆ పై ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇచ్చారు. సినిమా అక్కడ కూడా బాగానే కాసులు కురిపిస్తోంది. అంతే కాదు, సుధీర్  వర్మ డైరక్షన్లో చేస్తున్న కేశవ సినిమాకు ఈపీసీ విడుదలకు ముందు కాస్త ఇబ్బందులు వున్నాయి. ఇప్పుడు ఈ హిట్ తో ఆ ఇబ్బందులు ఎగిరిపోయాయి. ఆర్ఎఫ్సీలో చకచకా షూటింగ్ జరిగిపోతోంది. 

Show comments