చిరుకు లాసిక్ సర్జరీ?

60ప్లస్ గా మారిన తరువాత మెగాస్టార్ చిరంజీవి తన అందచందాలను మెరుగుపర్చుకునే పనిలో పడిన సంగతి తెలిసిందే. కేరళలో, విదేశాల్లో ఎక్సర్ సైజ్ లు చేసారని, ట్రీట్ మెంట్లు తీసుకున్నారని, ఇలా రకరకాల గ్యాసిప్ లు వినిపించాయి. ఏమయితేనేం, కాస్త తగ్గారు. వయసు తగ్గినట్లు అనిపిస్తున్నారు. 150వ సినిమా కు ఫుల్ గ్లామరస్ గా తయారయ్యారు.

అయితే కళ్లకు కళ్ల జోడు తప్పలేదని, సైట్ వుండడంతో తరచు అది పెట్టుకోవాల్సి వచ్చేదని తెలుస్తోంది. అందుకే ఈ సమస్య లేకుండా లాసిక్ ఆపరేషన్ ను ఆ మధ్య చేయించుకున్నట్లు తెలుస్తోంది. మాక్సీవిజన్ సంస్థ ఈ తరహా శస్త్ర చికిత్సలకు పెట్టింది పేరు. దాని యజమాని చిరుకు మంచి సన్నిహితులు కూడా. ఆయనే చిరుకు ఆపరేషన్ చేసి, కళ్ల జోడు నుంచి విముక్తి కలిగించినట్లు తెలుస్తోంది. 

నిజానికి చిరు ఎప్పుడు కళ్ల జోడు పెట్టుకుని కనిపించలేదు. బహుశా రీడింగ్ గ్లాసెస్ అవసరం పడి వుండొచ్చేమో? ఆఖరికి ఆ అవసరం కూడా లేకుండా ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Readmore!
Show comments

Related Stories :