జ‌గ‌న్ 507.. వైఎస్సార్ 212.. ఎన్టీఆర్‌ 83.. టీడీపీ 161

తెలుగుదేశం మ‌హానాడుపై ఒక విశ్లేష‌ణ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మూడు రోజుల పాటు సాగిన మ‌హానాడులో చంద్ర‌బాబు నాయుడు చేసిన‌ ప్ర‌సంగాల్లో ఎవ‌రెవ‌ర్ని ఎన్ని సార్లు త‌ల‌చుకున్నారు.. ఎవ‌రి పేరును ఎన్నిసార్లు ప‌లికారు అన్న లెక్క‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కొంద‌రి ప‌రిశీల‌న‌, విశ్లేష‌ణ ప్ర‌కారం బాబు మ‌హానాడులో ప్ర‌తిప‌క్ష జ‌గ‌న్‌మోహన్ రెడ్డి నామ‌ధేయాన్ని అంద‌రికంటే ఎక్కువ సార్లు ఉచ్చ‌రించార‌ట‌. త‌న ప్రసంగాల్లో మొత్తం 507 సార్లు జ‌గ‌న్ పేరు ప‌లికార‌ట‌. 

చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగాల్లో టీడీపీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు రామారావు కంటే కూడా జ‌గ‌న్‌, వైఎస్ పేర్ల‌నే ఎక్కువ‌గా ప‌లికిన‌ట్టు విశ్లేష‌ణ వెల్ల‌డిస్తోంది. మొత్తం 507 సార్లు జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించిన బాబు 212 సార్లు వైఎస్‌ను స్మ‌రించుకున్నార‌ట‌. ఇక 78 సార్లు వైఎస్సార్‌సీపీని, 18 సార్లు సాక్షిని మ‌న‌నం చేసుకున్నార‌ట‌. ఇక త‌న ప్ర‌సంగాల్లో ఎన్టీఆర్ పేరు కేవ‌లం 83 సార్లు మాత్ర‌మే బాబు ప‌లికిన‌ట్టు విశ్లేషణ చెబుతోంది. టీడీపీ పేరును 161 సార్లు ఉచ్చ‌రించిన బాబు స్వ‌యంగా త‌న పేరును మాత్రం 117 సార్లు ప్ర‌స్తావించుకున్నార‌ట‌.

మొత్తంమీద తెలుగుదేశం మ‌హానాడులో ప్ర‌సంగిచిన‌వారిలో అధిక‌శాతం జ‌గ‌న్‌, వైఎస్సార్ పేర్ల‌ను ఎక్కువ‌సార్లు ప్ర‌స్తావించార‌ట‌. దీన్ని బ‌ట్టి చూస్తేనే అర్థ‌మ‌వుతోంది బాబు అభ‌ద్ర‌త‌. కేవ‌లం ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించేందుకు, సొంత డ‌బ్బా కొట్టుకునేందుకే బాబు మ‌హానాడు నిర్వ‌హించార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

Show comments