'బంగారం' ఆగస్టులోనే

అనుకోని నిర్ణయం వెలువడితే ఏమో కానీ, ఇప్పటికిప్పుడు వున్న నిర్ణయాల ప్రకారం బాబు బంగారం సినిమా విడుదల ఆగస్టు నెలకు వాయిదా పడిపోయింది. అయితే ఆగస్టు తొలి వారంలో లేదా మూడోవారంలో విడుదల అవుతుంది. అయితే ఏ నిర్ణయమైనా ఈనెల 15న తరువాతే తీసుకుంటారు. 

ఎందకుంటే వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రస్తుతం యుఎస్ లో వున్నారు. ఆయన 15న ఇండియాకు తిరిగి వస్తారు. అప్పుడు మరోసారి డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారు. 29న వచ్చేయవచ్చు కానీ, అనవసరంగా రెండు వారాల టైట్ పొజిషన్ లో విడుదల కావాలి.  అ..ఆ సినిమా ఇలాగే సరైన డేట్ చూసుకురావడం వల్లే మంచి విజయం సాధించింది. 

ఆగస్టు మూడోవారం తరువాత సరైన సినిమా ఏదీ ప్రస్తుతానికి లేదు. అందువల్ల నాలుగువారాల పాటు ఆరామ్ గా ఆడేసుకోవచ్చు. యూనిట్ ఆలోచనే ఇదే అని తెలుస్తోంది. కానీ హీరో, డైరక్టర్ మారుతి మాత్రం అనుకున్న డేట్ కు విడుదల చేసేద్దామనే ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది. కానీ కబాలి విడుదల వల్ల అన్నీ తారుమారయ్యాయి.

Show comments