ఆదాశర్మ సినిమాకి 'నోట్ల రద్దు' దెబ్బ.!

'హార్ట్‌ ఎటాక్‌' ఫేం ఆదా శర్మ బాలీవుడ్‌లో నటించిన 'కమాండో 2' సినిమాకి పెద్ద నోట్ల రద్దు దెబ్బ గట్టిగానే తగిలేసింది. 'తుపాకీ' సినిమాలో విలన్‌గా నటించిన విద్యుత్‌ జమ్వాల్‌ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి వుంది. అయితే, పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు. 

ఇక, 'కమాండో 2' సినిమా కోసం ఆదా శర్మ చాలా కష్టపడి కసరత్తులు చేసేసింది. శరీరాన్ని రబ్బర్‌లా సాగదీసేసింది. జిమ్నాస్టిక్స్‌ చేసేసింది.. ఇంకా చాలా చాలానే చేసింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం కరాటే, కుంగ్‌ఫూ తదితర పోరాట విద్యలూ నేర్చుకుంది ఆదా శర్మ. సినిమా రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ అవడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిదేనని అంటోంది ఆదాశర్మ. 

ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డాననీ, తనలోని కొత్త యాంగిల్‌ని 'కమాండో 2' చూపిస్తుందంటున్న ఆదా శర్మ, రొటీన్‌ గ్లామరస్‌ హీరోయిన్‌ పాత్ర కాకుండా, చాలా భిన్నంగా ఈ సినిమాలో తన పాత్ర వుంటుందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో తనకు యాక్షన్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కుతుందని ఆదా శర్మ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Show comments