బాబోయ్.. మాకొద్దీ బ్రహ్మోత్సవం

కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగ్గా ఆడకపోయినప్పటికీ స్టార్ డమ్ ఉంటే టీవీల్లో బాగానే క్లిక్ అవుతాయి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ నటించిన ఎన్నో ఫ్లాప్ సినిమాలకు టీవీల్లో మంచి టీఆర్పీలు వస్తుంటాయి. కానీ మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమా బుల్లితెరకు కూడా పనికిరాలేదు. ఇప్పుడీ సినిమా హక్కుల్ని వదిలించుకోవడానికి జీ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ నానా తిప్పలు పడుతోందట. 

బ్రహ్మోత్సవం సినిమా థియేటర్లలోకి ఇలా వచ్చిన వెంటనే అలా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను ఒకసారి కూడా చూడ్డం వేస్ట్ అని నూన్ షోస్ టైమ్ కే ప్రేక్షకులు ఏకగ్రీవంగా తేల్చేశారు. అలాంటి సినిమా శాటిలైట్ రైట్స్ ను దాదాపు 10కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది జీ టీవీ. సినిమా విడుదలకు ముందే డీల్ కుదుర్చుకోవడంతో అంత ధర పలికింది. ఇప్పుడీ సినిమాకు టీవీల్లో కూడా టీఆర్పీలు రావడం లేదట. 

దీంతో బ్రహ్మోత్సవం ప్రసారం చేసిన ప్రతిసారి భారీ నష్టాలు చవిచూస్తోందట జీ టీవీ. శాటిలైట్ రైట్స్ ను నిర్మాతకు వెనక్కి ఇచ్చేసి కొంత డబ్బును వాపస్ తీసుకోవాలని సదరు ఛానెల్ భావిస్తోందట. అయితే సినిమా ఫ్లాప్ అయిందని డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి ఇవ్వరు కదా... శాటిలైట్ రైట్స్ కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కదా..

Show comments