అఖిలేష్ పై పోటీకి తండ్రి రెడీనట!

సమాజ్ వాదీ పార్టీ రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. మొన్నేమో అఖిలేష్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నట్టుగా, అతడే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా, కొడుకును మొండోడిగా అభివర్ణించిన ములాయం సింగ్ యాదవ్ ఈ రోజుకు తనయుడిపై విరుచుకుపడ్డాడు. తీవ్ర స్థాయి విమర్శలతో చెలరేగాడు. ఈ వేడిలో ఈయన ఆసక్తికరమైన చాలెంజ్  చేశాడు. తను అఖిలేష్ పై పోటీకి సిద్ధం అని ములాయం ప్రకటించాడు!

వచ్చే ఎన్నికల్లో అఖిలేష్ పై పోటీ చేస్తానని ఈయన ప్రకటించేశాడు! అలాగే కొడుకుపై ములాయం ఆసక్తికరమైన ఆరోపణలు చేశాడు. అఖిలేష్ బీజేపీకి దగ్గరయ్యాడని ములాయం అంటున్నాడు. తనయుడు మత రాజకీయాలు చేస్తున్నాడంటూ ధ్వజమెత్తాడు. ముస్లింలను పార్టీకి విరోధులుగా మార్చాడని విరుచుకుపడ్డాడు.

ఎన్నికల గుర్తు విషయంలో తమ పోరాటం సాగుతుందని, ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తామని ఈయన తెలిపాడు. సోదరుడు శివపాల్ యాదవ్ పై కూడా ములాయం దుమ్మెత్తి పోశాడు. విబేధాల పరంపరలో ములాయం- అఖిలేష్ ల పోరు ఇప్పుడు మరింత ముదిరి పాకానపడినట్టే.

అయితే ములాయం మాటలకు విశ్వసనీయత లేకుండా పోయింది. ఈ రోజుకు అఖిలేష్ పై విరుచుకుపడిన ఆయన రేపు.. మళ్లీ తనయుడిని ప్రశంసిస్తూ ప్రకటన చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.  Readmore!

Show comments

Related Stories :