నాగ్ ఏది ముందు? ఏది వెనుక?

ఆగస్టు నెలలో ఫుల్ గా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. మళ్లీ సెప్టెంబర్ వస్తే పెద్ద సినిమాల తాకిడి వుంటుంది. అక్టోబర్ లో దీపావళి తప్పితే మళ్లీ సినిమాకు డల్ సీజన్ మొదలవుతుంది. అందుకే ఆగస్టు నెలలో ఎక్కడ అక్కడ స్లాట్ చూసుకోవాలని అందరూ ట్రయ్ చేస్తున్నారు.

నాగార్జునకు సంబంధించి రెండు సినిమాలు ఆగస్టులో రావాలి. ఒకటి తన కొడుకు హీరోగా సాయి కొర్రపాటి, కొత్త దర్శకుడితో నిర్మించిన యుద్ధం..శరణం సినిమా. రెండవది తను హీరోగా నటించిన రాజుగారి గది -2.

ఈ రెండు సినిమాలు దాదాపు ఫినిషింగ్ స్టేజ్ లో వున్నాయి. ఈ రెండు సినిమాలకు కనీసం మధ్యలో ఓ వారం రోజులన్నా గ్యాప్ వుండేలా చూడాలి. 11వ తేదీ ఆల్ రెడీ ప్రీ ఆక్యుపై అయిపోయింది. ఫస్ట్ వీక్ వేళకు ఈ సినిమాలు రెడీ కావు.

అంటే ఇక ఆగస్టు థర్డ్, పోర్త్ వీక్ లు మాత్రమే మిగిలాయి. ఆగస్టు 25 నాగ్ చైతన్య సినిమా విడుదలకు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అలా అయితే నాగ్ రాజుగారి గది సెప్టెంబర్ లోకో, దీపావళికో రిజర్వ్ చేయాలి.

ఇదిలా వుంటే, నాగార్జున నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది. దానికి కూడా డేట్ చూడాలి. ఈ రెండు సినిమాలు అయిన తరువాతే దాన్ని బయటకు పంపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Show comments