బాబును అవమానిస్తున్న గాలి ముద్దుకృష్ణమ!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశాడు తెలుగుదేశం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు. తెలంగాణలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో ఒకదానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఈయన ఆ రాష్ట్ర సీఎంను కోరాడు. ఎన్టీఆర్ స్ఫూర్తితో జిల్లాల విభజన జరిగిందని.. కాబట్టి వాటిల్లో ఒకదానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశాడీయన. 

మరి వీరి విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అనే సంగతిని పక్కన పెడితే.. ఇదే సమయంలో తెలంగాణ సీఎంకు మరో విజ్ఞప్తి కూడా చేశాడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎన్టీఆర్ కు భారతరత్నను ఇప్పించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తనవంతు ప్రయత్నం చేయాలని ఈయన కోరాడు!

సరిపోయింది పో.. అసలు అధినేత స్థాయి ఏమిటో తెలియక గాలి ముద్దుకృష్ణమనాయుడు కేసీఆర్ ను ఈ విషయంలో సాయం అడుగుతున్నట్టుగా ఉన్నాడు. ఒక్కసారి చంద్రబాబు గారి ప్రెస్ మీట్లలో ఏదేనీ ఒకదాన్ని ముద్దుకృష్ణమకు వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఏ ప్రెస్ మీట్ లో అయినా బాబు తన సమర్థత ఏమిటో తనే చెప్పుకొంటూ ఉంటారు. అసలు ఆయన స్థాయికి ఎలాంటిది? ఆయనే చెప్పుకొంటూ ఉంటారు కదా! అంబేద్కర్ కు భారతరత్నను ఇప్పించింది తనే అని బాబుఎన్ని సార్లు చెప్పుకున్నారు? ఈ విషయం గాలికి తెలియదా?  Readmore!

మరి తనకు ఏ మాత్రం చుట్టం కాని అంబేద్కర్ మీదే జాలిపడి భారతరత్నను ఇప్పించిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి సొంత మామకు ఇప్పించుకోలేరా? అది కూడా పిల్లనిచ్చి, పార్టీనిచ్చి, వాడుకోవడానికి తన బొమ్మనిచ్చి.. ఇన్ని చేసిన మామకు భారతరత్నను ఇప్పించుకోలేరా చంద్రబాబు నాయుడు! రెండేళ్లలో బాబుకు ఇది చేతగాకపోయిందని చెప్పి కేసీఆర్ ను సాయం అడగాలా? ఇలా అడిగి బాబును అవమానించాలా!

Show comments

Related Stories :