ప్రస్తుతం టాలీవుడ్ లో అనూప్ టైమ్ నడుస్తోంది. తమన్ తమిళ్ కు వెళ్లిపోయాడు.. దేవిశ్రీ బిజీ అయిపోయాడు లాంటి విషయాల్ని పక్కనపెడితే, అనూప్ కు మాత్రం బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నాయనేది మాత్రం వాస్తవం. తాజాగా ఈ మ్యూజిక్ డైరక్టర్ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకున్నాడు. వీటిలో ఒకటి పూరి-బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాగా.. ఇంకోటి అఖిల్-విక్రమ్ కుమార్ సినిమా. ఈ రెండు సినిమాలు ఇప్పుడు అనూప్ రూబెన్స్ వే.
గతేడాది వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత అనూప్ నుంచి ఆ రేంజ్ లో మరో ఆల్బమ్ రాలేదు. ఆటాడుకుందాం రా, ఇజమ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి సినిమాలకు అనూప్ అందించిన సంగీతం తేలిపోయింది. చివరికి స్టార్ ఎట్రాక్షన్ ఉన్న కాటమరాయుడు సినిమాకు కూడా అనూప్ మంచి మ్యూజిక్ అందించలేకపోయాడు.
పవన్ లాంటి హీరో ఉన్న సినిమాలకు ఓ మోస్తరు సంగీతం అందించినా పాటలు ఆటోమేటిగ్గా హిట్ అయిపోతాయి. కానీ కాటమరాయుడు విషయంలో అలా జరగలేదంటే తప్పు అనూప్ దే అనుకోవాలి. సరైన సక్సెస్ లేకపోయినా బాలయ్య 101వ సినిమా అవకాశం అనూప్ కు దక్కింది. హార్ట్ ఎటాక్, టెంపర్, ఇజమ్ లాంటి సినిమాలకు అనూప్ తో వర్క్ చేశాడు దర్శకుడు పూరి. ప్రస్తుతం అనూప్ తప్ప మరో ఆల్టర్నేటివ్ లేకపోవడంతో మరోసారి అతడికే ఛాన్స్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక అఖిల్-విక్రమ్ కుమార్ విషయానికొస్తే...
ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా అనూప్ కు అవకాశమిస్తాడు విక్రమ్ కుమార్. వాళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది.