టాలెంట్ చూపిస్తున్న పవన్ ఫ్యాన్స్

చెప్పను బ్రదర్ అంటూ బన్నీ ఏ ముహూర్తాన అన్నాడో కానీ అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్ అతడిపై కత్తికట్టారు. పవన్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఇప్పటివరకు అల్లు అర్జున్ పై పడలేదు. తనకేం కాదులే అని కూడా బన్నీ అనుకొని ఉండొచ్చు. కానీ డీజే టీజర్ విడుదలైన తర్వాత ఆ ప్రభావం ఎంత ఉందనే విషయం ఈ మెగా హీరోకు తెలిసొచ్చింది. శివరాత్రి కానుకగా విడుదలైన టీజర్... వ్యూస్ లోనే కాదు, డిస్-లైక్స్ లో కూడా రికార్డు సృష్టిస్తోంది. ఈ పనికి ఎవరు కారణం అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఓ స్టార్ హీరో సినిమాకు సంబంధించి యూట్యూబ్ లో టీజర్ లేదా ట్రయిలర్ విడుదలైతే ఇప్పటివరకు అది ఎన్ని వ్యూస్ సాధించిందనే విషయమే రికార్డుగా ఉండేది. కానీ ఫస్ట్ టైం డిస్-లైక్స్ లో కూడా డీజే టీజర్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతానికైతే ఈ టీజర్ ను లైక్ చేసిన వారి సంఖ్య 87 వేలు ఉంటే... టీజర్ ను ఇష్టపడని వారి సంఖ్య కూడా 71వేలకు పైనే ఉండడం విశేషం. ఓ టీజర్ కు ఇంతమంది డిస్-లైకర్స్ ఉండడం కూడా ఓ రికార్డే. 

లైక్స్, డిస్-లైక్స్ సంగతి పక్కనపెడితే... డీజే టీజర్ మాత్రం యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధిస్తోంది. ఇప్పటికే 37లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ సినిమా.. రేపటికి మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తన టీజర్ ను ఇష్టపడిన వాళ్లందరికీ  సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ.

Show comments