మనోళ్లకి సన్నీ పిచ్చి పట్టింది

బాలీవుడ్‌లో సన్నీలియోని మోజు పూర్తిగా డెడ్‌ అయిపోయింది. ఒకటి, రెండు సినిమాలు బాగానే చూసారు కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ బాలీవుడ్‌ జనాలు తిప్పికొట్టారు. షారుక్‌ సినిమా రయీస్‌లో ఐటెమ్‌ సాంగ్‌ చేసినప్పటికీ పెద్దగా ఒరిగిన ప్రయోజనం లేదు. దీంతో బాలీవుడ్‌లో సన్నీకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 

అక్కడి వాళ్లకి మొహం మొత్తేసిన సన్నీని ఇప్పుడు మనవాళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారు. అసలు డాన్సే సరిగా రాని సన్నీతో ఐటెమ్‌ సాంగులు, స్టేజీ షోలు చేయించుకుంటున్నారు. 'రోగ్‌' చిత్రం ఆడియో వేడుకలో సన్నీతో పర్‌ఫార్మ్‌ చేయించుకున్న పూరిజగన్నాథ్‌ ఇప్పుడామెకి బాలకృష్ణ చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ ఆఫర్‌ చేసాడు. 

మరోవైపు తన సినిమాకి ఏదో విధంగా ఆకర్షణ తీసుకురావాలని, మళ్లీ తనని జనం ఆదరించేలా చేసుకోవాలని పట్టుబట్టి మరీ సన్నీలియోనితో తన చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేయించుకుంటున్నాడు రాజశేఖర్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో అతను చేస్తోన్న పిఎస్‌వి గరుడవేగ చిత్రంలో సన్నీ ఐటెమ్‌ సాంగ్‌ చేస్తోంది. ఇంతకుముందే కరెంట్‌ తీగలో సాంగ్‌ చేసిన సన్నీ ఇప్పుడీ సినిమాలకి కొత్తగా తెచ్చే ఆకర్షణ ఏమిటనేది వేచి చూడాల్సిందే.

Show comments