'కోన' పట్టువదలడం లేదట

రవితేజ-బాబీ సినిమా క్యాన్సిల్ అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. రవితేజ రెమ్యూనిరేషన్, హీరోయిన్ ఛాయిస్, ఇంకా నిర్మాణ వ్యయం తదితర అంశాలపై నిర్మాతలు వెనకడుగు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ తొలి సినిమా విషయం ఖర్చు అంచనాలు దాటి దెబ్బతిన్నామని, ఈ సినిమా నిర్మాణం కూడా ముఫై కోట్లకు చేరిపోతే తమకు చాలా కష్టం అవుతుందని, అందువల్ల హీరో రెమ్యూనిరేషన్ దగ్గర నుంచే అన్నీ తగ్గించుకుంటూ వస్తేనే తాము సినిమా చేయగలమని నిర్మాతలు అంటున్నట్లు తెలుస్తోంది. 

కానీ తన రెమ్యూనిరేషన్ తగ్గించుకునేది లేదని రవితేజ కచ్చితంగా చెప్పేసాడని టాక్. దీంతో నిర్మాతలు వెనక్కు తగ్గేసారట. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ఆది నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న రచయిత కోన వెంకట్ మాత్రం ఎలాగైనా ఈ ప్రాజెక్టును సెట్ చేయాలని ఒకటికి రెండు డిస్కషన్లు, మీటింగ్ లతో బిజీగా వున్నారట. రవితేజను కాస్త ఒప్పించి, నిర్మాతలకు భరోసా ఇచ్చి, ఎలాగైనా ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయించాలని కిందా మీదా అవుతున్నారట.

 నిర్మాణ వ్యయం ఇరవై కోట్లు దాటకుండా చూసే పూచీ తనదని కోన హామీ ఇస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తమ తొలి చిన్న సినిమా విషయంలోనే ఇలా బడ్జెట్ కంట్రొల్ సాధ్యం కాలేదని, పెద్ద సినిమా విషయంలో ఎలా సాధ్యమవుతుందని నిర్మాతలు జంకుతున్నారట. ఇలా తీవ్ర డిష్కషన్లలో నలుగుతోంది రవితేజ-బాబీ సినిమా. 

Show comments