బాహుబలి 2 ఓన్ రిలీజ్ @ కర్ణాటక

బాహుబలి 2 థియేటర్ హక్కులు అంటే హాట్ కేక్ నే. అందులో సందేహం లేదు. అయితే ఇప్పటి దాకా ఆ సినిమా కర్ణాటక హక్కులు మాత్రం ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. మిగిలిన ఏరియాల హక్కులు అన్నీ ఏప్పుడొ భయంకరమైన రేట్లకు ఇచ్చేసారు. కానీ కర్ణాటక దగ్గర మాత్రం పీట ముడి బిగుసుకుపోయినట్లు కనిపిస్తోంది. 

దీంతో ఇక నిర్మాతలే నేరుగా కర్ణాటకలో విడుదల చేసుకునే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. దీనికి కారణం ఒకటి కాదు రెండు మూడు వున్నాయి. ఒకటి కర్ణాటకలో టికట్ రేటు మీద సీలింగ్ కచ్చితంగా విధించడం. 200 రూపాయలకు మించి టికెట్ అమ్మడానికి లేదు అని క్లియర్ గా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం. ఈ రేటుకు అమ్మితే బాహుబలి సినిమా హక్కులకు పెట్టే మొత్తం రికవరీ కావడం కష్టం. ఆ మాటకు వస్తే ఆంధ్రలో కూడా అదే పరిస్థితి. అయితే ఆంధ్రలో దొడ్డి దారిన దాదాపు అన్ని పెద్ద సినిమాలకు చాలా జిల్లాల్లో ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. బాహుబలికి అసలు సమస్య లేదు.

ఇక కర్ణాటకలో మరో సమస్య, కట్టప్పతో వచ్చి పడింది. కావేరీ జల వివాదానికి సంబంధించి కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ తమిళనాడు స్టాండ్ కు మద్దతు పలకడం అన్నది కర్ణాటక జనాలకు నచ్చలేదు. అక్కడి ఉద్యమసంఘాలు బాహుబలి2 ప్రదర్శనను అడ్డుకుంటాం అని ఇప్పటికే హెచ్చరించాయి. సత్యరాజ్ క్షమాపణ చెబితే ఓకె అంటున్నారు. మరి ఆయన చెబుతారో లేదో తెలియదు. విడుదల రోజు కర్ణాటకలో సీన్ ఎలా వుంటుందో తెలియదు. అందుకే ఎవరు కొన్నా లేనిపోని తలకాయనోప్పులు. 

అందుకే ప్రస్తుతానికి నిర్మాతలే నేరుగా విడుదల చేద్దామని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎలాగూ పార్ట్ 2 లో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చాయి. ఓ ఏరియా వుండిపోయినా నష్టం ఏమీ లేదు. Readmore!

Show comments