​విరామం లేదు.. విశ్రాంతి లేదు

టైం దొరికితే విదేశాలకు చెక్కేయడం మహేష్ కు అలవాటు. ఫ్యామిలీతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఈసారి మహేష్ లేకుండానే అతడి కుటుంబం సింగపూర్ వెళ్లింది. పిల్లలతో కలిసి నమ్రత హాలిడేయింగ్ లో ఉంటే మహేష్ మాత్రం చెమటోడుస్తున్నాడు. మురుగదాస్ సినిమాను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా వియత్నాంలో షూటింగ్ పూర్తిచేసిన మహేష్.. అట్నుంచి అటు నేరుగా చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. వియత్నాంలో తీసిన యాక్షన్ సన్నివేశాలకు కొనసాగింపుగా చెన్నైలో మరికొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్ ను దాదాపు పక్కా చేశారు. ఇదే టైటిల్ తో వచ్చేవారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెండు భాషల్లో ఇదే టైటిల్ ఫిక్స్ చేశారు. మలయాళం, హిందీలోకి సినిమాను డబ్ చేస్తున్నారు. 

తాజాగా షూట్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలతో స్పైడర్ కు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సినిమాను జూన్ 23న విడుదల చేయాలనుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.

Show comments