శ్రీరామనవమికి స్పైడర్ లుక్?

మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ మూవీ స్పైడర్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉగాదికి రావాల్సిన లుక్ రాలేదు. మహేష్ బాబే స్వయంగా కాస్త ఓపిక పట్టండి అంటూ ట్వీట్ చేయాల్సి వచ్చింది.

విశ్వసనీయ వర్గాల కథనం ఏమిటంటే, లుక్ డిజైన్లు రెడీగా వున్నాయి. మహేష్ బాబు ఓ లుక్కేయాలి అంతే. ప్రస్తుతం వియత్నాంలో వున్న హీరో మహేష్ బాబు మూడో తేదీకి ఇండియాకు వస్తారు. రాగానే లుక్ డిజైన్ లపై ఓ లుక్కేయడం, ఆ పై విడుదల చేయడం చకచకా జరిగిపోతాయని తెలుస్తోంది.

లుక్ కాస్త ఆలస్యం అయిన కొద్దీ దానిపై అభిమానుల అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే ఇప్పుడు అసలు సమస్య. మరీ ఓవర్ ఎక్స్ పెక్టేషన్లు ఎప్పుడూ కాస్త కష్టమే.అందుకే  మరీ అంచనాలు పెరిగిపోకుండా, వీలయినంత త్వరగా టైటిల్ లోగొ, లుక్ కలిపి విడుదల చేయాలని చూస్తున్నారు. కానీ డైరక్టర మురుగదాస్ ఎక్కడా ఒక్క రోజు గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నారు. దాంతో డైరక్టర్,హీరో, నిర్మాత లుక్ మీద డిస్కస్ చేసే సమయమే చిక్కడం లేదని తెలుస్తోంది.

ఆఖరికి అకేషన్ గా వుంటుందని శ్రీరామనవమిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Show comments