నయనతారకి పొగరెక్కువేనట

హీరోయిన్‌ నయనతారకి పొగరెక్కువ.. అన్న మాట ఈనాటిది కాదు. ఎప్పటినుంచో వున్నదే. కానీ, కాస్తలేటుగా తనకు పొగరెక్కువన్న విషయాన్ని నయనతార అంగీకరించింది. 'అవును, నాకు పొగరెక్కువే.. కానీ, ఆ పొగరు అందరి విషయంలోనూ చూపించను.. నన్ను తక్కువగా చూసేవారి విషయంలో మాత్రమే పొగరు ప్రదర్శిస్తాను..' అంటూ తాజాగా నయనతార ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

''సినీ పరిశ్రమలో నేను హీరోయిన్‌గా రాణించేందుకోసం కష్టపడుతున్నాను.. కెరీర్‌ మొదట్లో ఎలా వున్నానో, ఇప్పుడూ అలాగే వున్నాను.. అయితే, మొదట్లో సినీ పరిశ్రమ గురించి పూర్తిగా తెలియదుగనుక కథల ఎంపికలో అయినా, ఎక్స్‌పోజింగ్‌లో అయినా కొన్ని పొరపాట్లు చేసి వుండొచ్చు.. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కదా.. అందుకే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను.. ఇది చూసి, నయనతారకి పొగరెక్కువని అంటున్నారు.. కానీ నాకున్న పొగరుకి అర్థం ఏంటో నాకు మాత్రమే తెలుసు..'' అంటూ ఓ ఇంటర్వ్యూలో 'పొగరు'పై క్లారిటీ ఇచ్చేసింది నయనతార. 

తెలుగు సినిమాలు ఎందుకు ఒప్పుకోవడంలేదు, ఒప్పుకుంటున్నా పబ్లిసిటీ కోసం కలసిరావడంలేదు.? అని ప్రశ్నిస్తే, 'తమిళ సినిమాలతో బిజీగా వున్నాను.. ప్రమోషన్‌ విషయంలో అయినా, డేట్స్‌ విషయంలో అయినా నేను ముందే దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేస్తాను.. నాతో సినిమాలు చేసినవారెవరూ నా మీద విమర్శలు చేయలేదు.. జరుగుతున్నదంతా దుష్ప్రచారం మాత్రమే..' అంటూ ‘డోర‘ సినిమా ప్రమోషన్ లో బిజీగా వున్న నయనతార తనపై వస్తున్న విమర్శలపై పై విధంగా స్పందించింది.

Readmore!
Show comments