ఆ సినిమాలో సెక్స్ డోస్ ఎక్కువట

హంటర్ సినిమా ఆధారంగా తయారైంది బాబుబాగాబిజీ. క్లాస్ ఏక్టర్ అండ్ డైరక్టర్ అని పేరు పడిన అవసరాల శ్రీనివాస్ ఎక్కడ టెంప్ట్ అయ్యారో, ఎందుకు ఓకె అన్నారో కానీ, మొత్తానికి ఈ సినిమా చేసేసారు. తక్కువ బడ్జెట్ లో పూర్తయింది. సేల్ కూడా ఒకె. అన్నీ బాగానే వున్నాయి కానీ, హంటర్ సినిమాలో వున్న ఓవర్ సెక్స్ డోస్ ఈ తెలుగు రీమేక్ లోకి కూడా వచ్చిందని తెలుస్తోంది. డైరక్టర్ ల్యాప్ టాప్ లో సినిమాను చూసిన ఇండస్ట్రీ జనాలంతా, అబ్బో సెక్స్ కంటెంట్ ఓ రేంజ్ లో వుందికదా అని లొట్టలు వేసారట.

కనిపించిన అమ్మాయినల్లా పక్కలోకి లాగాలనుకునే క్యారెక్టర్ ను చేసాడు అవసరాల. ఈ సీన్లన్నీకాస్త బోల్డ్ గానే చిత్రీకరించారట. ముఖ్యంగా హంటర్ లో ఓ జాకెట్ విప్పే కీలక సీన్ ను యాజ్ ఇట్ ఈజ్ గా దించేసారట. ఇప్పుడు ఇవన్నీ మన సెన్సారు జనాలు వుంచుతారా? కట్..కట్..అంటారా? అన్నది డవుట్ గా వుంది.

ఇక్కడ కట్ అంటే మాత్రం సినిమా డవుట్ లో పడుతుంది. రివిజన్ కమిటీకి వెళ్లాల్సిందే. అదంతా కాస్త తలకాయనొప్పి వ్యవహారం. పైగా సెక్స్ డోస్ ఎక్కువ వున్న సినిమా అని హడావుడి జరిగిపోతే, ఫ్యామిలీలు సినిమాకు దూరంగా వుంటాయి. అదో సమస్య.

Show comments