లవ్ ఇండియా..హేట్ ఇండియన్స్

క్రేజీ డైరక్టర్ పూరిజగన్నాధ్ డ్రగ్స్ కేసులో ఇబ్బందులు పడుతూ కూడా తన భవిష్యత్ ప్రాజెక్టు గురించి ఓ డిఫరెంట్ పాయింట్ చెప్పారు. ఎప్పటికైనా జనగణమన సినిమా తీయడం తన లైఫ్ ఏంబిషన్ అని వెల్లడించారు. పైగా ఐ లవ్ ఇండియా, ఐ హేట్ ఇండియన్స్ అన్నది దాని ట్యాగ్ లైన్ అని కూడా వెల్లడించేసారు. 

జనగణమన సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో పూరిజగన్నాధ్ చేస్తారని ఏడాది క్రితమే వార్తలు వినవచ్చాయి. కానీ అది మెటీరియలైజ్ కాలేదు. అయితే ఓ ఛానెల్ తో మాట్లాడుతూ ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానని పూరి వెల్లడించారు. అందులో కేవలం ఈ డ్రగ్స్ వ్యవహారాలే కాదు, దేశంలోని అనేక సమస్యలు ప్రస్తావనకు వస్తాయన్నారు. 

దేశం మీద ఎంతో ప్రేమ, బాధ్యత వుంటే తప్ప జనగణమన లాంటి స్క్రిప్ట్ తయారు చేయలేమని, తనకు అవి వున్నాయి కనుకే అలాంటి స్క్రిప్ట్ సిద్దం చేసానని పూరి అన్నారు. మొత్తం మీద మళ్లీ మరోసారి జనగణమన స్క్రిప్ట్ తెరపైకి వచ్చింది. పైగా చిత్రమైన ట్యాగ్ లైన్ కూడా బయటకు వచ్చేసింది. మరి పూరి ఈ కేసుల నుంచి బయట పడాలి. ఎవరైనా హీరో ఆ సినిమా చేయడానికి ముందుకు రావాలి. అప్పుడు తెలుస్తుంది. పూరి అంతలా చెబుతున్న ఆ జనగణమన అంటే ఏమిటో?

Readmore!
Show comments

Related Stories :