'జనసేన' థియరీ అర్థం కాలేదన్న నటుడు!

పవన్ కల్యాణ్ రాజకీయాలు తనకు అర్థం కాలేదని, జనసేన థియరీ ఏమిటో అర్థం అయ్యాకా ఆ పార్టీ గురించి స్పందిస్తాను అని వ్యాఖ్యానించాడు రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళీ వ్యాఖ్యానించాడు. ఒక వార్తా చానల్ ఇంటర్వ్యూలో పోసాని  సమకాలీన రాజకీయాలపై మాట్లాడాడు. ఒక సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, ఆ తర్వాత ప్రజారాజ్యంలో పనిచేసి, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడిన పోసాని.. తన స్వార్థం కోసం అయితే ఎక్కడా ఒకచోటే ఉండిపోలేదు.

తను కమ్మోడిని అని గట్టిగా చెప్పుకునే పోసాని.. ఒక సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సొంత ఖర్చుతో పేపర్ యాడ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీ వ్యతిరేక వైఖరినే అవలంభించాడు. ప్రజారాజ్యం ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి.. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు. 

వైఎస్సార్ మరణానంతరం ఆయన ఘనత గురించి సొంత ఖర్చులతో పేపర్ యాడ్స్ ఇచ్చాడు పోసాని. తర్వాతి కాలంలో జగన్ పై తెలుగుదేశం పార్టీ లక్ష కోట్ల ఆరోపణలు చేస్తున్న తరుణంలో.. పోసాని తెలుగుదేశం సత్యసంధతను ప్రశ్నించాడు. చంద్రబాబు నిజాయితీ ఏ పాటిది? అంటూ మీడియా ముఖంగానే మాట్లాడాడు పోసాని.

ఇలాంటి నేపథ్యం ఉన్న పోసానికి కూడా పవన్ కల్యాణ్ థియరీ  అర్థం కాలేదట. ఇది వరకూ కొందరు ప్రముఖులు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Show comments