సరదాకి - గమ్మునుండవో జగనూ?

ఈ వైకాపా జనాలకు పనీ పాటా లేదు. ఏదో ఒక లొల్లి చేస్తూనే వుంటారు. కేంద్రం ఇవ్వాలి..కేంద్రం ఇవ్వాలి అని ఒకటే లొల్లి. ఏంది ఇచ్చేంది. రాష్ట్రాన్ని చీల్చి రెండు ముక్కలు చేసి చేతికి ఇచ్చింది చాలదా? ఇంకేంటి ఇచ్చేది? 

బాబు వైపు నుంచి కొంచెం ఆలోచించవచ్చు కదా జగన్ బాబు? ఎన్ని ఇచ్చారో? ఏమి ఇచ్చారో అర్థం అవుతుంది. అబ్బే అలా ఎందుకు ఆలోచిస్తారు? 

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతూనే రెండు మంత్రి పదవులు ఇచ్చారా? పనిలో పని వెంకయ్య నాయుడికి కూడా మంత్రి పదవి ఇచ్చారు కదా? సో, తెలుగుదేశం హ్యాపీనా కాదా? ఎందుకంటే పార్టీ పదేళ్లు కష్టకాలంలో వున్నపుడు పెట్టుబడి పెట్టి, పార్టీని బతికించుకుంటూ వచ్చిన సుజన చౌదరికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయనపై ఆరోపణలు వున్నాయి, కోర్టు కేసులు వున్నాయి, వద్దు అని మోడీ ఏమన్నా అన్నారా? లేదు కదా?

సరే, శివరామకృష్ణన్ కమిటీ అంటూ ఒకటి వేసారు. రాజధాని ఎక్కడ వుండాలి అన్నదానిపైన. బాబు అధికారంలోకి రావడంతోనే ఆ కమిటీ నివేదిక ఏమయింది? దాదాపు బుట్టదాఖలు అయింది. ఆ కమిటి రాజధాని ఎక్కడ వద్దు అందో అక్కడే రాజధాని డిసైడ్ అయింది. మరి కేంద్రం ఏమన్నా ఈ కమిటీ నివేదక సాకుగా వద్దని చెప్పిందా? లేదు కదా? Readmore!

రైతుల నుంచి భూ సేకరణ బదులు సమీకరణ అని, పైసా ఖర్చు లేకుండా భూములు సంపాదిస్తుంటే, ఇది మంచిదా? చెడ్డదా? రైతులు ఇష్టంగా, ఇస్తున్నారా? కష్టంగా ఇస్తున్నారా? అని కేంద్రం ఏమన్నా ఆరా తీసిందా? లేదు కదా?

రాజధాని అంటే నాలుగు బిల్డింగులు కట్టుకుంటారు అనుకుంటే, అవి తప్ప, ఏవేవో చేస్తుంటే, ప్రపంచ దేశాలు అన్నింటికీ భాగస్వామ్యం ఇస్తుంటే, చైనా లాంటి మన 
భద్రతకు ముప్పు వున్న దేశాన్ని కూడా పాలు పంచుకోమని పిలుస్తుంటే, కేంద్రం ఏమన్నా, అసలు ఏమిటిది? ఏం జరుగుతోంది? అని ఆరా తీసిందా? అడిగిందా? లేదు కదా?

ఓటుకు బోలెడు నోట్లు ఇస్తూ, దొరికిపోయి, మనం మనం బరంపురం అని ఇద్దరు ముఖ్యమంత్రులు సర్దుకుపోతే, అసలు ఏమిటీ అరాచకం? నిజంగా జరిగిందా? ఆ విడియో ఏది? ఏమిటి ఇదంతా అని కేంద్రం ఏమన్నా అడిగిందా? లేదు కదా?

గుజరాత్ లో వద్దు పొమ్మని అక్కడి జనం, రైతులు తిప్పి కొడితే అవే అణు విద్యుత్ కేంద్రాలను మన శ్రీకాకుళం మీద రుద్దుతుంటే, ఇది మా దగ్గర క్లిక్ కాలేదు అని ఏమన్నా అందా కేంద్రం? లేదుకదా?

అంతెందుకు బాబుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కావాల్సినవి జరిగాయి, జరుగుతున్నాయి కదా? ఫర్ ఎగ్జాంపుల్ కేసుల వున్నా కూడా ఏకంగా దేశంలోనే రెండో అత్యన్నత పౌరపురస్కారాన్ని బాబు తో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తికి ఇచ్చారా లేదా?

సినిమా ఇండస్ట్రీలో, బయట ఎంతమంది గొప్పోళ్లు వున్నా, తెలుగుదేశం అనుబంధ వర్గానికి సంతృప్తి కలిగేలా గే పద్మశ్రీలు, వగైరాలు ప్రకటించారా లేదా? ఎప్పుడూ లేనిది ఓ కమర్షియల్ చిత్రం అది కూడా అసంపూర్తి చిత్రానికి ఏకంగా ఉత్తమచిత్రం అవార్డు కట్టబెట్టారా లేదా? 

ఇలా నాయుడూస్ వర్గానికి సంతృప్తి కలిగేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు కదా? ఇంకా మరేంటి? ఏదో కావాలి? కావాలి? అంటారు?

హోదా ఇస్తే ఏమొస్తుంది? బాబు మద్దుత వర్గానికి కావాల్సిన పనులు, అవార్డులు, కాంట్రాక్టులు, ఇవన్నీ హోదాతో సాధ్యమవుతాయా? పైగా హోదా వల్ల ఖజానాకు ఏమన్నా భారీగా డబ్బులు వస్తాయా? పోనీ వాటితో, ఫ్రీ..ఫ్రీ.ఫ్రీ..అని పంచేసి, ఓట్లుతెచ్చుకోవడానికి? ఏదీ కాదు. మరెందుకు కిందా మీదా అయిపోవడం?

అందువల్ల బాబు అండ్ కో కు కావాల్సినవన్నీ కేంద్రం నుంచి వస్తున్నాయి? మరెందుకు వైకాపా గగ్గోలు పెట్టడం. గమ్మునుండవో జగనూ.

Show comments

Related Stories :