సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సుడిగాడు...?

50కి పైగా సినిమాలు చేసినా ఇప్పటివరకు స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయాడు. అంతెందుకు సుడిగాడు తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు. అందుకే అల్లరోడు ఇప్పుడు మరోసారి సుడిగాడిపై కన్నేశాడు. కుదిరితే సుడిగాడు పార్ట్-2ను తెరపైకి తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాడు.

సుడిగాడు సినిమా మొత్తం పేరడీలే. తెలుగు హిట్ సినిమాల్లోని సన్నివేశాలు, డైలాగ్స్ అన్నింటినీ కలిపికొట్టి హిట్ కొట్టారు. తమిళ సినిమాకు రీమేకే అయినప్పటికీ టాలీవుడ్ టచ్ బాగానే ఇచ్చారు. ఆ సినిమా తర్వాత మరిన్ని హిట్ సినిమాలొచ్చాయి. పంచ్ డైలాగులు కూడా వచ్చాయి. సో.. ఈ ఐదేళ్లలో అలా వచ్చిన హిట్ సీన్లు, పంచ్ డైలాగులతో సుడిగాడు-2ను తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడట అల్లరినరేష్.

సీక్వెల్ కు సంబంధించి ఇప్పటికే తన సన్నిహితులు కొందరితో చర్చలు జరిపాడు ఈ హీరో. సుడిగాడు సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. మరి పార్ట్-2కు కూడా అతడే దర్శకత్వం వహిస్తారా లేక మరో దర్శకుడికి అల్లరినరేష్ ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.

Show comments