మహేష్ హీరోయిజం సాంగ్ రెడీ

మురుగదాస్-మహేష్ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా జరుగుతోంది. సంగీత దర్శకుడు హారిష్ జయరాజ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కు అద్భుతమైన ట్యూన్ సెట్ చేసాడట. దానికి తన ఫీలింగ్స్ పెర్ ఫెక్ట్ గా రావాలన్న ఉద్దేశంతో దర్శకుడు మురగదాస్ తమిళంలో ముందుగా సాంగ్ రాయించేసారట. 

ఇందుకోసం ప్రఖ్యాత రచయిత వైరిముత్తు కుమారుడు మదన్ కిర్కి ను ఇందుకు ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈ వెర్షన్ తో పాటు రికార్డింగ్ చెన్నయ్ లో పూర్తయిపోయింది. ఈ ట్యూన్ కి, ఈ లిరిక్స్ ను ఇంప్రూవైజ్ చేస్తూ తెలుగులో పాట రాయిస్తారన్నమాట. 

సినిమా షూట్ ప్రారంభం అవుతూనే ముందుగానే ఈ పాటనే షూట్ చేసే ఐడియాలో యూనిట్ వుంది. అందుకోసం కూడా ఓ సెట్ ను రెడీ చేస్తున్నట్లు వినికిడి.  దాని తరువాత అన్నపూర్ణలో వేసే భారీ రెండు ఫ్లోర్లు ఐ బి ఆఫీసులోకి యూనిట్ షిఫ్ట్ అవుతుంది.

Show comments