ఒకేమాట: నిన్న ప్రతిపక్షం, నేడు నీతిఅయోగ్

ప్రతిపక్షం మాట్లాడితే అది అభివృద్ధికి ఆటంకం.. అరే, బాబూ... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టిస్తున్నారు, కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తూ పచ్చపార్టీ నేతల జేబులు నింపుతున్నారు.. అంటూ మొత్తుకుంటే..  ఇది రాజకీయం కాదు, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నాయి అంటే.. సమాధానం ఇచ్చే నాథుడు లేడు. 

ఈ విషయంలో ప్రతిపక్షం వాళ్లు గగ్గోలు పెట్టినా, బాధ్యతగా తీసుకుని మీడియా (పచ్చమీడియా కాదు) ఏకరువు పెట్టినా .. బాబు విధానాలు రైటో రైటు.. అని మొత్తుకున్నారు. నిధులు పక్క దారి పట్టించి పచ్చ పార్టీ జేబులు నింపుకొంటూ దానికి ‘నీరు-చెట్టు’ అని పేరు పెట్టుకుని పర్యావరణం అనే బలహీనతను ఆసరాగా చేసుకుని దోచేసుకుంటున్నారో మొర్రో.. అంటే కోటి రూపాయలు దోచేసుకుని ఒక చెట్టు పెంచినా చాలు కదా.. అంటూ చాలా ఉదారవాదపు మాటలు!

ఇప్పుడేమైంది? స్వయంగా నీతి అయోగ్ స్పందించింది. మీకు నిధులు ఇచ్చింది దేనికి? వాటిని ఖర్చు పెడుతున్నది దేనికి? అంటూ నీతి అయోగ్ నిలదీసింది. వెనుకబడిన జిల్లా కోసం అంటూ ఒక్కో జిల్లాకు వంద కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తే.. వాటిని కాస్తా ముఖ్యమంత్రి పర్యటనల ఏర్పాట్లు, పర్యటనల సందర్భంగా ప్రచారానికి... వాడుకున్నారు.. బాబుగారి డాంభీకాలకు, దర్జాలకు పోగా మిగిలిన సొమ్మును పచ్చపార్టీ పుత్రుల జేబులను నింపడానికి ‘నీరు-చెట్టు’ వంటి కార్యక్రమాలకు డిజైన్ చేశారు.

మొక్కల మాటున మెక్కేశారు! అదేమంటే.. చెట్లు పెంచొద్దా? పచ్చదనాన్ని పెంపొందించవద్దా? అని ఎదురువాదనలు! పచ్చదోపిడీకి పచ్చని చెట్లే రక్ష మరి. వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధుల్లో కొంతభాగాన్ని ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల కోసం ఖర్చు చేశారు కలెక్టర్లు. ప్రతిపక్షాన్ని విమర్శించడానికి, జగన్ పై విరుచుకుపడటానికి ముఖ్యమంత్రి సభలు ఏర్పాటు చేసుకొంటున్నాడు. వాటికి జనాలను తరలించడానికి, బాబుగారి భద్రత కోసం, ఇతర ఏర్పాట్ల కోసం చేసే ఖర్చు మొత్తం ఆ నిధుల నుంచే పెట్టారు. 

అసలే కేంద్ర ప్రభుత్వం విదిలిస్తున్నది ముష్టి. ఆ ముష్టిని తన విలాసాల కోసం , తన తమ్ముళ్ల దోపిడీ కోసం ఖర్చే చేస్తున్నారు బాబు గారు. ఏపీకి నిధులు విదిల్చకపోవడానికి ఈ కారణాలను ఆసరాగా చేసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. దుర్వినియోగం చేస్తూ, విలసాలు చేసుకొంటున్న మీకు నిధులు ఎందుకు? అని ప్రశ్నిస్తోంది ఇప్పటికే! ఇదీ ముప్పై ఏళ్ల అనుభవజ్ఞుడి పాలన ఫలితాల్లో ఒకటి. మరి ఇంత జరుగుతుంటే.. బీజేపీ వాళ్లేమో మురుగుడ్లు మింగిన బావురుకప్పల్లా కూర్చున్నారు! 

Show comments