బాబుకు తెలియదన్నది నిజమే

విజయవాడ ఆలయాల కూల్చివేత వ్యవహారం బాబుకు తెలియదని, అధికారుల అత్యత్సాహం తప్ప వేరు కాదని తెలుగుదేశం నేతలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఇందులో ఒక నిజం వుందట.. బాబుకు తెలియనది వాస్తవమే.. అది ఏమిటంటే, బుద్దా వెంకన్న ప్రాపర్టీ కోసం రోడ్డును ఒక వైపు మాత్రమే విస్తరించడం అన్నది. ఇది బాబుకు తెలియకుండానే మేనేజ్ చేసారట. 

అందుకే బాబు బుద్ధా వెంకన్నకు, అధికారులకు ఫుల్ క్లాస్ పీకేసారని వినికిడి. విస్తరణ అన్నాక రెండు వైపులా చేయడం అన్నది కామన్..అందరికీ తెలిసిన పాయింట్. అలాంటి దాన్ని కూడా ఉల్లంఘిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చిన వాళ్లు అవుతారన్నది ఆలోచించలేదా? బాబు ప్రశ్నించినట్లు వినికిడి. 

ఒక్కోసారి తప్పని సరి అయినపుడు నష్టం భరిస్తే తప్పేమిటని, ప్రభుత్వానికి ఇచ్చిన భూములకు పరిహారంగా మరోదగ్గర చూసుకోవచ్చు కదా అని ఆయన హింట్ ఇచ్చినట్లు కూడా వదంతులు వినిపిస్తున్నాయి. 

పనిలో పనిగా స్వామీజీలను, భాజపా జనాలను రెచ్చ గొట్టడంప, కేశినేని నానికి కూడా బాబు క్లాసు పీకినట్లు వినికిడి. పని అయ్యే మార్గం చూసుకోవాలి కానీ, పనిని జటిలం చేసే వ్యవహారం చేస్తే ఎట్లా అని బాబు నిలదీసినట్లు తెలుస్తోంది.

Show comments