చైతూతో సమంత రొమాన్స్.. పొయెట్ అయిపోయింది!

సమంత, నాగ చైతన్యలు చాలా యేళ్లుగానే ప్రేమలో ఉన్నారు. ప్రేమించి, కొన్నాళ్లు గడిపి వేరైపోకుండా.. ఇద్దరూ పెళ్లికి రెడీ అయ్యారు. మిగతా సినిమా వాళ్ల ప్రేమాయణాలతో పోలిస్తే వీరి ప్రేమలో చాలా నిజాయితీ కనిపిస్తుంది.

ఈ రకంగా వీరు అభినందనీయులే. మరి ప్రేమించడంలోనే కాదు, ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడంలో కూడా తనకు తిరుగులేదని సమంత నిరూపించుకుంది. ప్రేమ వ్యక్తీకరణ లో కవిగా మారిపోయింది సమంత. లేడీ పొయెట్ ను కవయిత్రి అనాలమో! తన ఫీలింగ్స్ ను చక్కగా అక్షరబద్ధం చేసింది సమ్.

చైతూ ఛాతి మీద పడుకుని... తీసుకున్న సెల్ఫీ ని పోస్టు చేసిన సమంత.. దాంతో పాటు తన ఫీలింగ్స్ ను కూడా పోస్టు చేసింది. తను ఒక సినిమా షూటింగ్ కోసం లాంగ్ షెడ్యూల్ తో చైతూకు దూరంగా వెళ్లాల్సి వస్తోందని, అయితే వెళ్లాలని అనిపించడం లేదని.. సమంత పేర్కొంది.

తను వెళ్లకుండా ఆగిపోవడానికి ఏదో ఒకటి జరగాలని సమంత ఆకాంక్షించింది. తను అనారోగ్యం బారినైనా పడాలని, తను వెళ్లాల్సిన ఫ్లైట్ టేకాఫ్ కాకుండా ఆగిపోవాలని, వర్షం రానుందనే హెచ్చరిక అయినా రావాలని.. ఏదో ఒకటి జరిగి తను వెళ్లడం ఆగిపోవాలని సమంత కోరుకుంది.

చైతూతో గడపడానికి ఈమె ఈ ఆకాంక్షలను వ్యక్తం చేసింది. ప్రేమలో ఇలాంటి ఎడబాట్లు కూడా మధురానుభూతులే! వీటినీ ఎంజాయ్ చేయొచ్చులే సమ్.

Show comments