కాజోల్‌ బీఫ్ పార్టీ: ఇదేం గోల.?

సెలబ్రిటీలు సోషల్‌ మీడియాకెక్కి మరీ వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పబ్లిసిటీ స్టంట్‌ అనుకోవాలో, పైత్యం అనుకోవాలో ఎవరికీ తెలియని పరిస్థితి. తన స్నేహితుడి పార్టీలో 'బీఫ్‌ వంటకం' అంటూ సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ నటి కాజోల్‌ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో, వీడియో ఇప్పుడు వైరల్‌ అయిపోయాయి. 'బీఫ్‌పై బ్యాన్‌ వున్నప్పుడు దాన్నెలా తింటావ్‌.?' అంటూ కాజోల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. 

'నేను తినలేదు మొర్రో.. అయినా అది బీఫ్‌ కాదు, బఫెలో మాంసం మాత్రమే.. అది కూడా చట్టబద్ధమైనది..' అంటూ వివరణ ఇచ్చుకుంది కాజోల్‌. 'చిన్న మిస్‌ కమ్యూనికేషన్‌..' అని కాజల్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోందిగానీ, జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం కాజోల్‌ తీరుని తప్పుపడ్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ తరహా వివాదాల్లో ఎప్పుడూ కాజోల్‌ తలదూర్చలేదు. అనూహ్యంగా ఆమె వివాదాన్ని కొనితెచ్చుకుందిప్పుడు. 

సోషల్‌ మీడియాలో వివాదాన్ని రాజేసి, ఇప్పుడు అదే సోషల్‌ మీడియాలో వివరణ ఇచ్చుకునేందుకు కాజోల్‌ ఎన్ని తంటాలు పడ్తున్నా, వివాదం మాత్రం సద్దుమణగడంలేదు. ఈ నేపథ్యంలో తన భర్త అజయ్‌ దేవగణ్‌తో కలిసి కాజోల్‌ నేడో రేపో మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇవ్వబోతోందట. ఇదే మరి, చేతులు కాల్చుకుని, ఆ తర్వాత ఆకులు పట్టుకోవడమంటే.

Readmore!
Show comments

Related Stories :