సింగిల్ థియేటర్లు శాతకర్ణికేనా?

అప్పుడే సంక్రాంతి సినిమాల కాక మొదలైపోయింది. సంక్రాంతికి థియేటర్ల సమస్య పెద్దగా ఎదురుకాదు వాస్తవానికి. ఎందుకంటే ముచ్చటగా మూడే సినిమాలు విడుదలవుతున్నాయి. అందువల్ల వీలయినంతవరకు షేర్ చేసుకుంటాయి. కానీ సమస్య వస్తున్నది సింగిల్ థియేటర్లు వున్న ఊళ్లలోనే. అలాగే రెండు థియేటర్లు వున్న చోట్ల కూడా. ఇలా సింగిల్ థియేటర్లు వున్న ఊళ్లలో అప్పుడే శాతకర్ణికి రిజర్వ్ చేయమని వివిధ మార్గాల్లో ఆదేశాలు వెళ్లిపోయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

శాతకర్ణి సినిమాలో హీరో బాలకృష్ణ అధికార పార్టీకి అత్యంత కీలకమైన వ్యక్తి అన్నది తెలిసిందే. అందుకే ఏ మార్గంలోనైనా అడిగితే కాదనే పరిస్థితి వుండదు.  సీడెడ్ లో సింగిల్ థియేటర్లు ఎక్కువగా శాతకర్ణికే ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.  ఈస్ట్ లో సురేష్ మూవీస్ కు కాస్త కీలక థియేటర్లు వున్నాయి. అవన్నీ ఇప్పుడు మాగ్జిమమ్ శాతకర్ణికే వుంటాయి. 

నైజాంలో మరీ ఎక్కువగా సమస్య వుండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా వరకు థియేటర్లు వున్నాయి. మళ్లీ ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ సమస్య ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ సురేష్ థియేటర్లు శాతకర్ణికి, గీతా థియేటర్లు ఖైదీ 150కి, దిల్ రాజు థియేటర్లు శతమానం భవతికి పంపకాలు అయిపోయే అకవాశం వుంది. కానీ సమస్య అల్లా సింగిల్ థియేటర్ల దగ్గరే వస్తుంది. అక్కడే ఇప్పటికే సరైన ఆదేశాలు వెళ్లిపోయినట్లు వినికిడి.

Show comments