సోషల్ మీడియాలో పవనిజం షురూ

కాటమరాయుడు హంగామా నిన్నట్నుంచి మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను నిన్న సాయంత్రం యూట్యూబ్ లో విడుదల చేశారు. సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన పవన్ ఫ్యాన్స్... కాటమరాయుడు సాంగ్ ను లైక్స్ తో ముంచెత్తారు.

విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన కాటమరాయుడు పాట... ఆ లెక్కను గంటగంటకు పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ 13 లక్షలకు పైగా వ్యూస్, లక్షా 30 వేలకు పైగా లైక్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. మిర మిర మీసం అంటూ సాగే ఈ పాట ఆల్ మోస్ట్ అందరికీ నచ్చింది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

వ్యూస్, లైక్స్ సంగతి అటుంచితే, ట్రెండింగ్ లో కూడా కాటమరాయుడు రికార్డు సృష్టించాడు. మిరమిరమీసం అనే హ్యాష్ ట్యాగ్ టాప్-10 వరల్డ్ ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలిచింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మిగతా పాటల్ని కూడా ఆన్ లైన్ లో విడుదల చేసి, ఈనెల 18న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేయాలని అనుకుంటున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. కొన్ని పాటల్ని మాత్రమే యూట్యూబ్ లో రిలీజ్ చేసి, మరికొన్ని సాంగ్స్ ను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో విడుదల చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్మాత శరత్ మరార్ ఓ నిర్ణయం తీసుకుంటాడు. 

ప్రస్తుతం కాటమరాయుడు యూనిట్ ఫారిన్ షెడ్యూల్ మోడ్ లో ఉంది. యూరోప్ లో 2 పాటలు షూట్ చేస్తారు. ఈ షెడ్యూల్ తో టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుంది. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈనెల 24 లేదా 29న రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ ను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో అధికారికంగా ప్రకటిస్తారు.

Show comments