బాబీకి ఉత్తేజ్ సాయం పడుతున్నారా?

సినిమా రంగంలో తెరపై ఎక్కువగా పేరు కనిపించకుండా, తెరవెనుక స్క్రిప్ట్ ల్లో, మాటల రచనలో ఎక్కువగా, ఏక్టివ్ గా సాయం పట్టేవాళ్లలో నటుడు ఉత్తేజ్ ఒకరు. అతనికి వున్న మల్టీ టాలెంట్ ను ఉపయోగించుకునే వాళ్లెందరో. ఇప్పుడు దర్శక రచయిత బాబీ వంతు వచ్చినట్లు తెలుస్తోంది. 

రవితేజ కోసం ఓ స్క్రిప్ట్ తయారీలో బిజీగా వున్నారు బాబీ అలియాస్ రవీంద్ర. ప్రస్తుతం హీరో రవితేజ ఖాళీగా వున్నారు. దానయ్య నిర్మాణంలో సినిమా ప్రారంభం కావాల్సి వుంది. దానికి కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తారు. అయితే ఈ లోగా మంచి సబ్జెక్ట్ ఏదయినా దొరికితే అది చేద్దామనే ఆలోచనతో వున్నారు రవితేజ. 

ఈ మేరకు ఆయనే స్వయంగా కొందరు డైరక్టర్లను సంప్రదించినట్లు వినికిడి. గతంలో తన సహకారంతో పవర్ సినిమా తీసిన బాబికి మరో చాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే సరైన సబ్జెక్ట్ కావాలి. అందుకే ఇప్పుడు బాబి కిందా మీదా పడుతున్నట్లు వినికిడి. ఉత్తేజ్, మరొకరి సాయంతో స్క్రిప్ట్ పై పగలు రాత్రి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments