వెంకయ్య కొత్త ఈక్వేషన్

వాదనలు ఎప్పుడు ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా వారు నిర్మించుకుంటారు. అందునా వెంకయ్య నాయుడు లాంటి మాటలు నేర్చిన వారైతే మరీనూ. వెంకయ్య ఎప్పుడో పురానాజమానాలో ప్రత్యక్షంగా ప్రజల నుంచి ఎన్నికయ్యారు. తరువాత ఆయన ప్రజల నుంచి ఎన్నిక కావడానికి అంతగా ధైర్యం చేయరు అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. 

అయితే వెంకయ్య వెర్షన్ మరోలా వుంది. ప్రత్యక్ష రాజకీయాలయితే కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అవుతాము..అదే ఇలా దొడ్డిదారిన రాజ్యసభకు అయితే అన్ని ప్రాంతాలకు చెందిన వారం అవుతాము అంటున్నారు వెంకయ్య నాయుడు. ఇంతకు ముందు కర్ణాటక, ఇప్పుడు రాజస్థాన్ ఇలా అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించినట్లు అవుతుందని ఆయన తన వాదన వినిపిస్తున్నారు. 

అంతే కాదు గతంలో ఆయన ఎప్పుడు వైజాగ్ వెళ్లినా, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నా, నాకు విశాఖతో ఆ అనుబంధం వుంది అనేవారు. ఇప్పుడు విజయవాడతో  నాకు ఎంతో అనుబంధం వుంది..విజయవాడలోనే నేను అరెస్టు అయ్యా. కళలు,రాజకీయాలు, మీడియా, ఇలా అన్నింటికి నెంబర్ వన్ విజయవాడే అంటున్నారు. మొత్తానికి వెంకయ్య భలే మాటకారే..అందుకే ఆయనకు నడుస్తోంది..

Readmore!
Show comments

Related Stories :