మామకు తగ్గ అల్లుడు బాబు

తాతమ్మ కల సినిమా తీసి ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే కీలకమైన కుటుంబ నియంత్రణ పథకానికి ఎదురుఈదారు. సినారె చేత, కు ని పథకానికి వ్యతిరేకం అన్నట్లు వుండే పాట రాయించారు.. కుని పథకం అమలు చేసి వుంటే కృష్ణుడు, గాంధీ పుట్టేవారా అనే అర్థం వచ్చే పాట అది. 

సరే అది ఆ కాలం.

ఇప్పుడు రోజులు మారాయి. ప్రభుత్వం చెప్పకుండానే, పిల్లలను పోషించడం అన్నదే కాదు, సాకడం కూడా కష్టమైపోయిన కాలం కాబట్టి, ఎవరూ ఒకర్ని మహా అయితే ఇద్దరిని మించి కనాలని అనుకోవడం లేదు. కానీ పాపం, చంద్రబాబు నాయుడు మాత్రం తెగ ఆవేదన చెందిపోతున్నారు ఎందుకో? ఆంధ్ర జనాభా తగ్గిపోతోందని, డబ్బున్నవారు కూడా ఒక్కర్నే కంటున్నారని ఆవేదన పడిపోతున్నారు. వాళ్లు ఒక్కళ్ని కంటే ఈయన బాధేమిటో మధ్యన?  కొన్నాళ్ల క్రితం కూడా ఇదే మాట చెప్పారు బాబు, ఇప్పుడూ ఇదే అంటున్నారు. అసలు బాబు మనసులోని మాటేమిటో?

ఏ జనాభా పెరగాలని అనుకుంటున్నారో? ఎవరి జనాభా పెరగాలని అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పేస్తే బాగుండును. డబ్బున్నవాళ్లు ఎక్కవ మంది పిల్లల్ని కనాలని పదే పదే అంటున్నారు. ఆ డబ్బున్న వాళ్లు ఎవరో? వాళ్లు ఎందుకు అర్జెంట్ గా జనాభా పెంచాలో? దాని ద్వారా చంద్రబాబు భవిష్యత్ లో ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో? అసలు ఆయన భవిష్యత్ దర్శనం ఏమిటో? కాస్త క్లారిటీగా చెప్పేస్తే, ‘ఆ జనాలు’  ఆ పనిమీద వుంటారు. 

Show comments