ఆ విషయంలో సల్మాన్ ను క్రాస్ చేసిన షారూక్

ప్రపంచంలోనే అత్యథికంగా పారితోషికం తీసుకుంటున్న సెలబ్రిటీస్ జాబితాలో ఈ ఏడాది కూడా సల్మాన్, షారూక్, అక్షయ్ చోటు దక్కించుకున్నారు. సల్మాన్ కు బాక్సాఫీస్ రికార్డులైతే వస్తున్నాయి కానీ, రెవెన్యూ పరంగా చూసుకుంటే షారూక్ ఖానే ముందున్నాడు.

"వరల్డ్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్" జాబితాలో సల్మాన్ ఖాన్ 71వ స్థానంలో ఉంటే.. అతడి కంటే ముందు వరుసలో షారూక్ 65వ స్థానంలో కొనసాగుతున్నాడు.

సల్మాన్ కేవలం సినిమాల్లో నటిస్తాడు. నటించినందుకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. కానీ షారూక్ మాత్రం తన ప్రతి సినిమాలో నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తాడు. అందుకే ఆదాయం విషయంలో సల్మాన్ కంటే ముందున్నాడు.

గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 వరకు లెక్కించిన ఆదాయం ప్రకారం.. షారూక్ ఖాన్ 38 మిలియన్ డాలర్లు సంపాదిస్తే... సల్మాన్ ఖాన్ 37 మిలియన్ డాలర్లు ఆర్జించాడు. వీళ్లిద్దరి కంటే కాస్త తక్కువగా 35.5 మిలియన్ డాలర్లతో అక్షయ్ కుమార్ జాబితాలో 80వ స్థానంలో కొనసాగుతున్నాడు.

పారితోషికం పరంగా హాలీవుడ్ స్టార్స్ తో భారతీయ హీరోల్ని అస్సలు పోల్చిచూడలేం. రూపాయల్ని డాలర్లలోకి మార్చి కంపేర్ చేసినప్పుడు మన హీరోలు టాప్-100 లిస్ట్ లోకి కూడా చేరుకోలేరు. అయితే గడిచిన మూడేళ్లుగా బాలీవుడ్ స్టార్స్ కూడా లిస్ట్ లోకెక్కారు. ఆర్జనలో ఏటా తమ ర్యాంక్ ను మెరుగుపరుచుకుంటున్నారు కూడా. 

ప్రపంచవ్యాప్తంగా అత్యథిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాలో భారత్ నుంచి వీళ్ల ముగ్గురికి మాత్రమే చోటు దక్కింది. ఫోర్బ్స్ పత్రిక ఈ వివరాల్ని వెల్లడించింది.

Show comments