పోర్న్ సినిమాల్లోంచి బాలీవుడ్‌లోకి వచ్చి, బాలీవుడ్‌లో మకాం పెట్టేసిన సెక్సీ భామ సన్నీలియోన్, భారత జాతీయ గీతాన్ని ఆలపించింది. ఆలపించింది.. అంటే జస్ట్ ఆలపించిందంతే. అనగా, లిప్స్ కదిపిందని అర్థం. ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లను సన్నీలియోన్ భర్తతో కలిసి తిలకించడమే కాకుండా, మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం 'జనగనమన' ఆలపించి అందర్నీ అలరించేసింది.
సాధారణంగా సినిమా ప్రోగ్రామ్స్‌లో ఈ మధ్య లైవ్ పెర్ఫామెన్స్ పేరుతో జనాన్ని వెర్రి వెంగళప్పల్ని చేసేస్తుండడం చూస్తున్నాం. పాట పాడినట్లు సింగర్స్ జస్ట్ లిప్స్ అలా కదిలిస్తోంటే, అప్పటికే రికార్డ్ చేసిన సాంగ్‌ని ప్లే చేసేస్తున్నారు. ఇక్కడా సన్నీలియోన్ జనగనమన ఆలపించిన సమయంలోనూ అదే స్ట్రాటజీని అమలు చేసినట్లున్నారు. ఎక్కడా సన్నీలియోన్ లిప్స్ మూమెంట్‌కీ, జనగనమన పాట ఆడియోకీ అస్సలేమాత్రం సింక్ అవలేదు.
ఏదో పాపులారిటీ కోసం.. పబ్లిసిటీ కోసం.. అన్నట్లు సాగింది సన్నీలియోన్ జనగనమన పాట పాడిన వ్యవహారం. ఇదేదో సినిమా పాటలకి అయితే చెల్లిపోతుందిగానీ, జాతీయ గీతం విషయంలో ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తే సెంటిమెంట్లు దెబ్బ తింటాయి. ఇక, ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కాస్తంత ఓవరాక్షన్ చేశాడు. అభిషేక్ ఓ జట్టుకి ఓనర్‌గా వ్యవహరిస్తున్నాడు ప్రో కబడ్డీ లీగ్‌లో. ఆ జట్టే గెలిచిందనుకోండి.. అది వేరే విషయం. మరో బాలీవుడ్ నటుడు, మన టాలీవుడ్ విలన్ సోనూ సూద్ కూడా ప్రో కబడ్డీ లీగ్‌లో హల్‌చల్ చేశాడు.. అదీ హుందాగా.!