భలేగా వుందిగా కాష్మోరా ట్రయిలర్

కార్తీ నటించిన లెటెస్ట్ మూవీ కాష్మోరా ట్రయిలర్ బయటకు వచ్చింది. భలేగా వుంది. అంటే ఇక్కడ అద్భుతంగా అని కాదు. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ ఇమాజినేషన్, వగైరా. సోషియో ఫాంటసీ లుక్ కనిపిస్తోంది ట్రయిలర్ లో. మరి ఆ కథేమిటన్నదాంతోటే వుంటుంది అసలు కథ. 

ఎందుకంటే, గ్రాఫిక్స్, విజువల్స్ వండర్ గా వుంటే సరిపోదు. కథ కూడా దాని పెర్ ఫెక్ట్ గా మిక్స్ కావాలి. ఆ క్లాజ్ అలా వుంచి చూస్తే మాత్రం ట్రయిలర్ చాలా ప్రామిసింగ్ గా వుంది. కార్తీ లుక్స్ వైవిధ్యంగా వున్నాయి. గ్రాఫిక్స్ వర్క్, నేపథ్య సంగీతం ట్రయిలర్ ను బాగా ఎలివేట్ చేసాయి. 

దీపావళి కానుకగా వస్తోందీ సినిమా పివిపి బ్యానర్ పై. బాహుబలి తరువాత ఈ తరహా సినిమాల నిర్మాణం మీద క్రేజ్ పెరిగింది కానీ, జనం కేవలం గ్రాఫిక్స్ వుంటే బారులు తీరడం లేదు. కథ, కథనాలు కూడా చూస్తున్నారు. మరి ఆ విషయంలో ఈ సినిమా ఎలా వుంటుందో చూడాలి.

Readmore!
Show comments