నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో. సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ చైతన్య మీడియాతో మాట్లాడారు.
సినిమాను గతేడాది డిసెంబర్‌లో విడుదల చేద్దామని అనుకున్నామని, కానీ రెండు లాంగ్వేజస్‌లో షూటింగ్ చేయడం కారణం ఒకటైతే, మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయడం వల్ల సినిమా ఇంత ఆలస్యమైంది. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ చేయడం పట్ల ఓ నటుడుగా చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేమమ్ ప్రమోషన్స్ సరిగా లేవనే వార్తలు ఎందుకు వచ్చాయో ఏమో, అలాగే నిర్మాతల ప్రమోషన్ స్ట్రాటజీ వారికి ఉంటుంది. కానీ ఒక నటుడుగా ప్రేమమ్ చిత్రీకరణ సమయంలో, ప్రమోషన్ విషయంలో పూర్తి సహకారం అందించాను అని అన్నారు నాగ్ చైతన్య.
- లవ్‌స్టోరీస్ నాకు కంఫర్ట్ జోన్ మూవీస్. ప్రేమమ్ తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఇంకా డిఫరెంట్ లవ్ స్టోరీస్ ట్రై చేస్తే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారని తెలిసింది. సాహసం శ్వాసగా సాగిపో అనే ఓ కుర్రాడు రెండు వేర్వేరు పరిస్థితుల్లో ఎలా ఉంటాడోనని చూపిస్తుంది. ఫస్టాఫ్ అంతా ఏ మాయ చేసావే సినిమాకు ఎక్స్‌టెన్షన్‌గా కనపడుతుంది. ఇక సెకండాఫ్ ఘర్షణ స్టయిల్లో సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా సాగుతుందన్నారు.
- దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రతి క్యారెక్టర్‌ను చాలా బాగా డిజైన్ చేస్తారు. ఇందులో క్యారెక్టర్స్‌ను చూస్తున్నప్పుడు ఆడియెన్స్ క్యారెక్టర్‌తో పాటు ట్రావెల్ చేస్తారు కాబట్టి, ఫస్టాఫ్ లవ్ స్టోరీ, సెకండాఫ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. ఏమాయ చేసావె తర్వాత ఆడియెన్స్ నున్న లవ్‌స్టోరీస్‌లో యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత ఆడియెన్స్ నన్ను యాక్షన్ జోనర్ సినిమాలకు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. ఇప్పటి వరకు చేయని బాడీ లాంగ్వేజ్‌తో, నేచురల్ యాక్షన్ పార్ట్‌తో సినిమా సాగుతుంది. కెరర్ బిగినింగ్‌లో నేను యాక్షన్ సినిమాలు చేసిన యాక్షన్ సినిమాల స్క్రిప్ట్స్ సెలక్షన్ చేసేంత మెచ్యురిటీ రాలేదేమో కాబట్టి అనుకున్నంత హిట్ కాలేకపోయాయి. అయితే ఇప్పుడు నటుడుగా కొంత నేర్చుకున్నాను. అలాగే గౌతమ్‌గారు ఆయన సినిమాలో క్యారెక్టర్స్‌ను కన్విన్సింగ్‌గా చూపిస్తారు. కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఒప్పుకున్నానని నాగ్ చైతన్య చెప్పారు.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా ఒన్ ఆర్ టూ డేస్ లో స్టార్ట్ అవుతుంది. ఇది కల్యాణ్ కృష్ణ తయారుచేసుకున్న కథ. పంజాబీ రీమేక్ కాదు. నిన్నే పెళ్లాడతా తరహాలో ఉండే లవ్ ఎంటర్‌టైనింగ్ జోనర్. ఈ సినిమాకు టైటిల్ ఏమీ అనుకోలేదు. మరో సినిమాను కృష్ణ దర్శకత్వంలో జెంటిల్‌మేన్ స్టోరీ రైటర్ డేవిడ్ నాథన్ అందించిన కథతో తెరకెక్కిస్తున్నాం.