మొన్న ఆగడు... నిన్న బ్రూస్ లీ.. తాజాగా మిస్టర్..!

ఇలా మూడు అట్టర్ ఫ్లాపులతో దర్శకుడు శ్రీనువైట్ల హ్యాట్రిక్ కొట్టాడు. ఆగడు, బ్రూస్ లీ లాంటి డిజాస్టర్స్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడి నుంచి సరికొత్త కథాంశం వస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కెరీర్ స్టార్టింగ్ లో శ్రీనువైట్ల చేసిన హిట్ మూవీస్ తరహాలో మంచి గ్రిప్పింగ్ స్టోరీ వస్తుందని ఆశించారు. కానీ వైట్ల మాత్రం మారలేదు. ఫ్రెష్ గా స్టోరీ పిక్ చేసుకున్నానని ప్రమోషన్స్ లో చెప్పిన ఈ దర్శకుడు.. థియేటర్లలో మాత్రం ప్రేక్షకుల చేత నరకం స్పెల్లింగ్ రాయించాడు.

మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో "మిస్టర్" ను భరించడం తలకుమించిన భారంగా మారింది. వరుణ్ తేజ్ చాలా ప్రయాస పడ్డప్పటికీ అటు వైట్ల నుంచి ఇటు టెక్నీషియన్స్ నుంచి అతడికి ఎలాంటి సహకారం దొరకలేదు. ఫలితంగా మిస్టర్ సినిమా ఏ వర్గాన్నీ మెప్పించలేకపోయింది. ఇంతకంటే కొత్తగా వైట్ల ఇక ఆలోచించలేడేమో అనే సందేహం కలిగేలా తెరకెక్కింది మిస్టర్ సినిమా.

ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు శ్రీనువైట్ల, వరుణ్ తేజ్. కానీ వాళ్ల నమ్మకాలేవీ నిలబడలేదు. ఈ మూవీ ఎఫెక్ట్ తో వైట్లకు మరో సినిమా ఛాన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇక వరుణ్ తేజ్ అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ములతో చేస్తున్న ఫిదా సినిమాపై ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుంది. లేదంటే  శ్రీనువైట్ల లానే తను కూడా ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాల్సి వస్తుంది.

Show comments