డైలమాలో రాజ్ తరుణ్ సినిమా

ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ లో మూడు, 14రీల్స్ లో ఒకటి, ఇలా ఏకంగా నాలుగు సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్నాడు హీరో రాజ్ తరుణ్. వీటిల్లో దొంగాట వంశీకృష్ణ డైరక్షన్ లో చేస్తున్న సినిమా పూర్తి కావచ్చింది. ఇది నవంబర్ లో విడుదలవుతుంది. దీని తరువాత ఫినిష్ చేయాల్సిన సినిమాకు డైరక్టర్ మారుతి కథ అందించారు. స్క్రిప్ట్ కూడా ఆయనే అందిస్తారు. సంజన రెడ్డి అనే కొత్త డైరక్టర్ ఈ సినిమాకు పని చేయాల్సి వుంది. సినిమా ముహుర్తం కూడా అయిపోయింది. 

అయితే ఇప్పుడు ఈ సినిమా డైలమాలో పడినట్లు తెలుస్తోంది. దర్శకుడు మారుతి హీరో హవీష్ తో యువి క్రియేషన్స్ బ్యానర్ పై తన కొత్త సినిమా పనిలో పడ్డారు. దీంతో కథ ఇచ్చేస్తానని, స్క్రిప్ట్ వర్క్ చేయించుకోమని మారుతి చెప్పేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆ సినిమా ఇప్పటికిప్పుడు జరిగేలా లేదు. ఈ సినిమాకు ఆది నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతోంది. ముందుగా గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ బ్యానర్ అనుకున్నారు. కాలేదు. ఆ తరువాత మారుతి టాకీస్ అనుకున్నారు. అదీ మారింది. ఆఖరికి ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ చేతుల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఇలా అర్థాంతరంగా ఆగింది. 

ఈ సినిమా తరువాత రచయిత వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా స్క్రిప్ట్ రెడీగా వుంది. ఈ సినిమాలో హీరో కొంత భాగం అంథుడిగా కనిపిస్తాడు. ఇది చాలా బాగా వచ్చిన స్క్రిప్ట్. అందువల్ల దీన్ని వెంటనే స్టార్ట్ చేసే అవకాశం వుంది. దీని తరువాత దర్శకుడు సుకుమార్ కథతో 14 రీల్స్ సినిమా వుంటుంది.

Readmore!
Show comments