దారుణం: అమలాపాల్‌పై నిందలేసేశాడు

ఎంతైనా డైరెక్టర్‌ కదా. చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పీ చెప్పనట్లు చెప్పేశాడు. హీరోయిన్‌ అమలాపాల్‌, దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం విదితమే. ఏడాది తిరగకుండానే ఈ పెళ్ళి పెటాకులైపోయింది. కారణం, వేరే వ్యక్తితో అమలాపాల్‌ 'రాసుకు పూసుకు తిరుగుతుండడం..' అంటూ మీడియాలో గాసిప్స్‌ గుప్పుమన్నాయి. 'సినిమాల్లో నటించబోనని చెప్పింది.. కానీ, పెళ్ళయ్యాక సినిమాల్లో నటిస్తోంది..' అని విజయ్‌ కుటుంబ సభ్యులు, అమలాపాల్‌పై నిందారోపణలు చేశారు. 

విజయ్‌ మాత్రం, 'అమలాపాల్‌ సినిమాల్లో తిరిగి నటిస్తానంటే నేనే ప్రోత్సహించాను.. అది కాదు అసలు కారణం' అని చెప్పాడు. ఇక్కడే మేటర్‌ క్లియర్‌, తప్పిదం పూర్తిగా విజయ్‌ వైపునే వుందని. 'మేం విడిపోవడానికి కారణం పూర్తిగా మా వ్యక్తిగతం..' అంటూనే, 'నమ్మకం లేని చోట వివాహబంధం కూడా నిలవదు..' అని చెప్పాడంటే, ఇంతకన్నా అమలాపాల్‌పై విజయ్‌కి అనుమానం వుందని కన్‌ఫామ్‌ చేయడానికి నిదర్శనం ఇంకేమన్నా కావాలా.? 

అమలాపాల్‌ సినీ నటి అన్న విషయం విజయ్‌కి తెలుసు. సినీ రంగంలో పరిచయాలు ఎలా వుంటాయో కూడా విజయ్‌కి బాగా తెలుసు. అలాంటప్పుడు, 'నమ్మకం లేదు..' అని ఇప్పుడు చెప్పడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. విజయ్‌ వివరణతో ఒక్కసారిగా తమిళ సినీ వర్గాలు షాక్‌కి గురయ్యారు. విజయ్‌ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని తాము ఊహించలేదని, అతని సన్నిహితులే చెబుతున్నారు. 

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రస్తుతానికి అమలాపాల్‌ నుంచి ఎలాంటి వివరణా రాలేదు. విజయ్‌ తొందరపడ్డాడుగనుక, అమలా పాల్‌ కూడా వివరణ ఇస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments