ఆ విషయంలో... బాబు, బాలయ్య, లోకేష్ ల మధ్యే పోటీ!

ఎవరేం చేసినా.. ఏపీకి జగనే సీఎం.. ’ ‘సర్వ స్వతంత్ర గణతంత్ర శుభాకాంక్షలు..’ వీడియోల రూపంలో బాలయ్య ఆణిముత్యాలు ఇంకెన్నో! ‘భారతదేశాన్ని అవినీతి మయం చేసేంత వరకూ నిద్రపోను..’, ‘అవినీతిలో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాను..’ ఇవి చంద్రన్న చమక్కులు. ఇక లోకేష్ బాబు సరేసరి. ‘అంబేద్కర్ వర్ధంతి..‘ ‘తాగునీటి సమస్యను ఏర్పాటు చేస్తాను..’ ‘అవినీతి, కులపిచ్చి, మతపిచ్చి.. ఇవన్నీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే..’ రాసుకొంటూ పోతే ఇలాంటి వెన్నో ఉన్నాయి!

నెటిజన్లు అంతా లోకేష్ బాబు మీదపడ్డారు. ఆయనకు మాట్లాడటం రాదని, నాలిక మందం అని, చంద్రబాబూ తన కొడుకును చాలా గొప్పగా చదవించాను, మేధావిగా తీర్చిదిద్దాను అని చెప్పుకోవడమే కానీ.. పబ్లిక్ లోకి వచ్చాకా లోకేష్ పట్టు ఏమిటో అందరికీ అర్థం అయిపోతోందని.. ఇలా అయితే కష్టమే అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇక మంత్రి అయిన లోకేష్ పై ఆయన ప్రజానీకం వేస్తున్న సెటైర్లు బీభత్సమైన స్థాయిలో ఉన్నాయి. కానీ తరచి చూస్తే.. లోకేష్ నే అనాల్సిన అవసరంలేదు. 

అపరమేధావి, అపర చాణుక్యుడు.. దేశ రాజకీయాలను ఫోన్ కాల్స్ తో సెటిల్ చేసిన చంద్రబాబు నోటి నుంచి జాలువారిని ఆణిముత్యాలు కూడా ఎన్నో ఉన్నాయని వీళ్లంతా గుర్తుంచుకోవాలి. ఎన్నికల ప్రచార సభలో.. ‘భారతదేశాన్ని అవినీతిమయం చేసేంత వరకూ నిద్రపోను..’ అని అన్నదిమరెవరో కాదు.. చంద్రబాబే కదా! లోకేష్ కేవలం తమ పార్టీకి కులపిచ్చి ఉందని చెప్పాడు, బాబైతే భారతదేశాన్నే అవినీతిమయం చేస్తానని అంతవరకూ నిద్రపోనని చాలెంజ్ చేశారు కదా! అంత వరకూ ఎందుకు.. ఇటీవల అసెంబ్లీలో ఏమన్నారు? అవినీతిలో ఏపీని నంబర్ వన్ పొజిషన్లో నిలిపాననే కదా.. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వ విభాగం ఒకటి ఏపీకి అవినీతిలో నంబర్ వన్ పొజిషన్ ఇచ్చింది.

 బాబుగారు దాన్నే గుర్తు పెట్టుకుని.. ఆ విషయాన్నే చెప్పినట్టున్నారు. ఇక బాలయ్య బాబు సరే సరి! సినిమాల్లో గొంతు గర్జిస్తుంది కానీ.. పబ్లిక్ స్పీకింగ్ లో బాలయ్య ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. పెద్ద పెద్ద పదాలు.. వాడతారు కానీ, వాటిని రివర్స్ లో వాడతున్నట్టుగా మాట్లాడతారు. రామాయణంతో మొదలుపెట్టి మహాభారతం మీదకుగా సాగుతుంది బాలయ్య ప్రసంగం. పబ్లిక్ స్పీకింగ్ లో ఎవరెన్ని పొరపాట్లు చేస్తారు.. జనాల్లో ఎంత గుబులు పుట్టిస్తారు.. అనే విషయాల్లో ప్రస్తుతానికి బాలయ్య, చంద్రబాబు, లోకేష్ ల మధ్యనే పోటీ ఉంది. వెనుకటికి వీరికి పోటీగా ది గ్రేట్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వారుండే వారు! ఆయన రాజకీయాల నుంచి రిటైర్ హర్ట్ అయ్యారు కాబట్టి.. పోటీ వీరి మధ్యనే!

Show comments