14న పటేల్ సర్

ఇటీవలి కాలంలో సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షించిన ప్రచార చిత్రాల్లో పటేల్ సర్ ఒకటి. సీనియర్ హీరో జగపతిబాబు కీలకపాత్రలో తయారైన సినిమా ఇది. సినిమా స్టార్ట్ చేస్తూనే వదిలిన జగపతి బాబు లుక్ కు మాంచి అప్లాజ్ వచ్చింది. ఆ సినిమాను చకచకా ఫినిష్ చేసి, ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

జగపతి బాబు డిఫరెంట్ రగడ్ లుక్ లో కనిపించే ఈ సినిమా, యాక్షన్ ప్లస్ చైల్డ్ సెంటిమెంట్ మేళవించి సాగుతుంది.

వాసు పరిమి అనే కొత్త దర్శకుడు మీడియం బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు సాయి కొర్రపాటి నిర్మాత. డిఫరెంట్ మూవీ అని ప్రేక్షకులు అంచనా వేస్తున్న ఈ సీనియర్ హీరో సోలో సినిమాతో పాటు నలుగురు కుర్ర హీరోలు నటించిన శమంతకమణి విడుదలవుతోంది. చూడాలి.. సీనియార్టీనా? యంగ్ బ్లడ్ నా? అన్నది.

Readmore!
Show comments

Related Stories :